Vijayawada to Singapore: ఏపీలో( Andhra Pradesh) అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభం అయ్యాయి. మరోవైపు ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు ప్రారంభించాయి. ఒకేసారి 12 ప్రధాన బ్యాంకుల కేంద్ర కార్యాలయాల నిర్మాణం ప్రారంభం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సమక్షంలో వాటికి శంకుస్థాపన జరగనుంది. ప్రపంచ దిగ్గజ పర్యాటక సంస్థలు అమరావతికి వస్తున్నాయి. పేరు మోసిన హోటళ్ల నిర్మాణం కూడా జరగనుంది. ఇటువంటి తరుణంలో విజయవాడ విమానాశ్రయానికి ప్రముఖుల తాకిడి పెరిగింది. అందుకే కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. పలు ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం కొత్త సర్వీసులు నడిపేందుకు ముందుకు వస్తున్నాయి. ఆక్యుపెన్సికి అనుగుణంగా సర్వీసుల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా ఇండిగో సంస్థ సింగపూర్ కు డైరెక్ట్ ఫ్లైట్ను ప్రారంభించింది. ఎందుకు ముహూర్తంతో పాటుగా టికెట్ ధర, విమాన వేళలను సైతం సంస్థ ప్రకటించింది. తద్వారా నాలుగు గంటల్లో సింగపూర్ కు వెళ్లే అవకాశం దక్కుతోంది.
రాకపోకలు ఎక్కువ..
సింగపూర్ తో( Singapore) ఏపీకి ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువ. ఏపీకి చెందిన లక్షలాది మంది అక్కడ స్థిరపడ్డారు. వర్తక, వాణిజ్య అవకాశాలు కూడా అక్కడ ఎక్కువ. ఈ తరుణంలో సింగపూర్ కు విమాన రాకపోకలు పెరిగాయి. దీనిని గుర్తించిన ఇండిగో సంస్థ విజయవాడ నుంచి నేరుగా సింగపూర్ కు విమాన సర్వీసులు ప్రారంభించనుంది. నవంబర్ 15 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన చార్జీలు, టైమింగ్స్ ను సైతం ప్రకటించారు.
Also Read: పవన్ కళ్యాణ్ గారు భీమవరం పేకాటలపై అతిగా స్పందించారా?
వారంలో మూడు రోజులు..
సామాన్య మధ్య తరగతి ప్రజల అవసరాల దృష్ట్యా టికెట్ ధరలను అందుబాటులోకి ఉంచింది ఇంటికివ సంస్థ. టికెట్ ధరను ఎనిమిది వేల రూపాయలుగా నిర్ణయించింది. సింగపూర్ నుంచి బయలుదేరే విమానం ఉదయం 7:45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అదే విమానం ఉదయం 10. O5 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. మధ్యాహ్నం రెండు ఐదు గంటలకు సింగపూర్ లోని సాంగి విమానాశ్రయానికి చేరుకుంటుంది. ప్రయాణ సమయం కేవలం నాలుగు గంటల మాత్రమే. ఇప్పటికే ఈ విమానానికి సంబంధించిన టిక్కెట్ల విక్రయాలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే వారంలో మూడు రోజులపాటు మాత్రమే ఈ సర్వీసులు నడవనున్నాయి. మంగళవారం, గురువారం, శనివారం మాత్రమే ఈ విమానాలు నడుస్తాయి. 180 నుంచి 230 సీట్ల సామర్థ్యం వరకు ఉంటుంది. అయితే ప్రయాణికుల రద్దీ పెరిగితే మాత్రం ఇండిగో విమాన సర్వీసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.