https://oktelugu.com/

Konaseema District: అన్నం కోసం రోడ్డెక్కిన హాస్టల్ విద్యార్థులు.. ఇంతకంటే ధైన్యం ఉంటుందా?*

కొందరు అధికారులు, సిబ్బంది తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. అటువంటి ఘటనే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో వెలుగు చూసింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 12, 2024 / 09:00 AM IST

    Konaseema District

    Follow us on

    Konaseema District: వసతి గృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తోంది ప్రభుత్వం. వసతులు సైతం మెరుగుపరుస్తుంది. కానీ అక్కడ అధికారుల తీరుతో ప్రభుత్వం అబాసుపాలు అవుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏకంగా విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. వార్డెన్ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అందమైన పెట్టండి.. జైల్లోనైనా పెట్టండి అంటూ విద్యార్థులు నినాదాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. గత కోనేళ్లుగా ఇక్కడ బీసీ వసతి గృహం నడుస్తోంది. అయితే మూడు నెలలుగా హాస్టల్లో సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. అక్కడ వార్డెన్ గా పనిచేస్తున్న వ్యక్తి సరిగ్గా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. హాస్టల్లో ఉన్నప్పుడు మద్యం తాగుతున్నాడు అని కూడా విద్యార్థులు చెబుతున్నారు. గత పది రోజులుగా ఉదయం, సాయంత్రం పెరుగన్నమే పెడుతున్నట్లు తల్లిదండ్రుల సైతం ఆరోపిస్తున్నారు. తక్షణం అధికారులు స్పందించి నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.

    * సంక్షేమ హాస్టళ్లపై ఫోకస్
    కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో తప్పిదాలను సరిచేస్తోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నారు. వసతి దీవెన, విద్యా దీవెన కింద అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని విడుదల చేసేందుకు నిర్ణయించారు. అదేవిధంగా పాఠశాలల నిర్వహణకు సంబంధించి నిధులను కూడా విడుదల చేశారు. ఈ తరుణంలో వసతి గృహంలో భోజనాలు సరిగ్గా లేవని విద్యార్థులు రోడ్డు ఎక్కడంతో ప్రభుత్వం సీరియస్ అంశంగా తీసుకునే అవకాశం ఉంది.

    * పెరగని డైట్ చార్జీలు
    వసతి గృహాల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా డైట్ చార్జీలను పెంచలేదు. 2018లో చివరిసారిగా టిడిపి ప్రభుత్వం విద్యార్థుల డైట్ చార్జీలను పెంచింది.కానీ ఒక 5 ఏళ్లలో ధరలు 200% పెరిగాయి. అయినా సరే చార్జీలు పెంచకపోవడంతో మెనూ అమలుపై ప్రభావం చూపుతోంది. వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన ఆహారం అందడం లేదు. దీనిపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.