Home Ministry for Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా, పంచాయితీ రాజ్, అటవీ, పర్యావరణం శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రస్తుతం ఎంత బిజీ గా ఉంటున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే ఆయన ‘పల్లె పండుగ 2.0’ ని ప్రారంభించి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయితీల అభివృద్ధి కోసం 6500 కోట్ల రూపాయిల నిధులను మంజూరు చేసాడు. నిన్న ఆయన రాజోలు లో పర్యటించి, అక్కడ వంద కోట్ల రూపాయిల విలువ గల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాడు. జనాలను ఉద్దేశించి పవర్ ఫుల్ స్పీచ్ ఇవ్వడమే కాకుండా, ఆ ప్రాంత వాసులతో అక్కడి సమస్యల గురించి మాటామంతి కార్యక్రమం కూడా చేపట్టాడు. అయితే ఈ సభ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలను చూస్తుంటే, భవిష్యత్తులో ఆయన హోమ్ మినిస్టర్ పదవి చేపట్టనున్నాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అధికారం పోయినప్పటికీ కూడా ఇప్పటికీ వైసీపీ నాయకులూ బూతులు ఆపడం లేదు. ప్రతీ ఒక్కరిని గమనిస్తూనే ఉన్నాను, నా దగ్గర క్షమా ఉండదు, పిఠాపురం లో ఇప్పటికే మీకు ఒకసారి చెప్పాను, త్వరలోనే మీ అంతు తెలుస్తాను, 2029 లో మేము మళ్లీ అధికారం లోకి వచేస్తాము, మిమ్మల్ని నడిరోడ్డు మీద నరుకుతాము అంటూ పెద్ద పెద్ద వార్నింగ్స్ ఇస్తున్నారు. మీరు మళ్లీ అధికారం లోకి రావాలని అనేది మీ అత్యాశ, పగటి కలలు కనకండి, నేను మిమ్మల్ని రానిచ్చే సమస్యే లేదు’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్ వెనుక చాలా అర్థాలు దాగి ఉన్నాయి అనేది గమనిస్తే అర్థం అవుతుంది. పిఠాపురం లో ఇప్పటికే ఒకసారి చెప్పాను అంటే దాని అర్థం ఏంటి?, గతం లో పిఠాపురం లో ఆయన నేను కనుక హోమ్ శాఖ తీసుకుంటే మీకు మామూలుగా ఉండదు, వేరేలా ఉంటుంది అని అంటాడు.
అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి, ఇక నిన్న రాజోలు లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన డైరెక్ట్ వార్నింగ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన హోమ్ శాఖ ని తీసుకోబోతున్నట్టు సంకేతాలు పరోక్షంగా ఇస్తున్నాడని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై టీవీ న్యూస్ చానెల్స్ లో నిన్న డిబేట్స్ కూడా జరిగాయి. ఇది ఎంత వరకు నిజం అవుతుందో తెలియదు కానీ, ఒకవేళ నిజం అయితే మాత్రం రాష్ట్రంలో పెను మార్పులు చూడొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వ్యవహరిస్తోంది. మొదట్లో ఈమె కాస్త విమర్శలు ఎదురుకున్నప్పటికీ, ఈమధ్య కాలం లో తన పనితీరుని బాగా మెరుగుపరుచుకుంది.