Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలం నుండి ఉభయ గోదావరి జిల్లాలో ‘వారాహి విజయ యాత్ర’ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ యాత్ర కి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లిన ఇసుక వేస్తె రాలనంత జనం వస్తున్నారు. ఇక ఈ యాత్ర కి సంబంధించిన మొదటి విడత పర్యటన నేటితో ముగిసింది. నేడు భీమవరం లో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సభకి అభిమానులు వేలాదిగా తరళి వచ్చి విజయవంతం చేసారు.
అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ గతం లో జరిగిన కొన్ని సంఘటనల గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. 2015 వ సంవత్సరం లో భీమవరం లో పవన్ కళ్యాణ్ పోస్టర్ ని చింపినందుకు గాను ప్రభాస్ ఫ్యాన్స్ పై పవన్ ఫ్యాన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి గొడవలు చేసారు. అప్పట్లో ఇరువురి హీరోల మధ్య జరిగిన ఈ గొడవ ని అదుపు చెయ్యడానికి భీమవరం టౌన్ లో 144 సెక్షన్ ని విధించారు.
ఈ గొడవ గురించి పవన్ కళ్యాణ్ నేడు ప్రస్తావించాడు ‘ గతం లో ఇదే భీమవరం లో ప్రభాస్ ఫ్యాన్స్ కి మరియు నా ఫ్యాన్స్ చిన్న పోస్టర్ విషయం లో పెద్ద గొడవ జరిగింది. ఈ సంఘటన నా మనసుని ఎంతో బాధించింది. అంత చిన్న విషయానికి అంత పెద్ద గొడవలు చెయ్యాల్సిన అవసరం లేదు, దయచేసి ఇలాంటి గొడవలకు దిగకండి అని మిమల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
దీని పై ప్రభాస్ ఫ్యాన్స్ నుండి కూడా చాలా సానుకూలమైన రెస్పాన్స్ వచ్చింది. అయిపోయింది ఎదో అయిపోయింది ఇక నుండి మా సపోర్టు జనసేన కి మాత్రమే అంటూ పాజిటివ్ గా ట్వీట్స్ వేస్తున్నారు. ఇంతకు ముందుతో పోలిస్తే జనసేన పార్టీ కి ఇతర హీరోల అభిమానుల నుండి రోజు రోజుకి సపోర్టు పెరిగిపోతుంది అనే చెప్పాలి.