https://oktelugu.com/

తెలుగు రాష్ట్రాల్లో బయటకు వెళ్లాలనుకునే వారు ఇక జాగ్రత్త!

వేసవికాలం ప్రారంభం అయ్యింది. భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు భానుడు భగభగమండుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి మాసంలో ఓ మోస్తారు.. ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దానికి కొనసాగింపుగా.. మార్చి మాసంలో సూర్యుడు భగభగలాడుతూ.. నిప్పులు చిమ్ముతున్నాడు. గత రెడు వారాలుగా వాతావరణం […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 23, 2021 / 02:39 PM IST
    Follow us on


    వేసవికాలం ప్రారంభం అయ్యింది. భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు భానుడు భగభగమండుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి మాసంలో ఓ మోస్తారు.. ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దానికి కొనసాగింపుగా.. మార్చి మాసంలో సూర్యుడు భగభగలాడుతూ.. నిప్పులు చిమ్ముతున్నాడు. గత రెడు వారాలుగా వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో ఎండవేడి విపరీతంగా పెరుగుతోంది.

    కోస్తా జిల్లాల్లో ఓ వైపు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుంటే.. మరోవైపు వడగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం నుంచి ఉత్తరాంధ్రలో 15 మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో విపరీతమైన వడగాలులు చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక సోమవారం విశాఖలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఉత్తర దిక్కున గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణ కన్నా రెండు డిగ్రీల సెల్సీయస్ అధికారంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

    ఇక తూర్పు గోదావరి జిల్లాలో 38 డిగ్రీల సెల్సీయస్ గా నమోదు అయ్యింది. రానున్న రోజుల్లో 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. ఇక విశాఖ పట్టణంలో 33 డిగ్రీల నుంచి 36 డిగ్రీల సెల్సీయస్ ఎండలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఎండలు ఠారెత్తిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ జిల్లాల్లో వడగాలలు ఎక్కువగా వీచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

    చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు పానియాలు తీసుకోవాలని, తద్వారా ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఒక్క కోస్తాంధ్ర జిల్లాల్లోనే కాకుండా.. ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ ఎండలు విపరీంతంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రతీ జిల్లాలో కనిష్టంగా 30 డిగ్రీల ఎండ ఉంటుంటుందని చెబుతున్నారు.ప్రజలు ఎండల నుంచి తమను తాము కాపాడుకోవాలని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.