https://oktelugu.com/

AP DSC Notification: నిరుద్యోగులకు హై అలెర్ట్ : డీఎస్సీ నోటిఫికేషన్.. నేడు టెట్ ఫలితాలు!

డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు లోగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈరోజు టెట్ ఫలితాలను విడుదల చేయనుంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 4, 2024 / 10:24 AM IST

    AP DSC Notification

    Follow us on

    AP DSC Notification: ఏపీలో ఈరోజు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల కానున్నాయి. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి ఫైల్ పై చంద్రబాబు సంతకం చేశారు. జగన్ సర్కార్ ప్రకటించిన 6000 ఉపాధ్యాయులకు మరో 10 వేల పోస్టులను కలిపి.. 16 వేల ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 6న డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈరోజు ప్రకటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు ఆన్లైన్లో ఈ టెట్ పరీక్ష జరిగింది. మొత్తం 4.7 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. 17 రోజులపాటు రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది. మరోవైపు టెట్ లో అర్హత సాధించిన వారికి డీఎస్సీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కూడా ఉంటుంది.

    * టెట్ కు ప్రత్యేకత
    ఈసారి టెట్ కు ప్రత్యేకత ఉంది. టెట్లో సాధించిన మార్కులకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉండనుంది. గతంలో టెట్ అర్హత సర్టిఫికేట్ ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటు అయ్యేది. 2022 నుంచి దీనిని లైఫ్ లాంగ్ గా నిర్ణయించారు. అయితే మార్కుల మెరుగుదల కోసం చాలామంది అభ్యర్థులు మరోసారి టెట్ రాయడం విశేషం. వాస్తవానికి ఈనెల రెండునే ఫలితాలు విడుదల కావాలి. కానీ కి విడుదలలో కొంత జాప్యం జరిగింది. దాని ప్రభావం ఫలితాల వెల్లడి పై పడింది. ఫలితాలను ప్రభుత్వ అధికార వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

    * డీఎస్సీకి ఏర్పాట్లు
    మరోవైపు డీఎస్సీ నోటిఫికేషన్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ లోగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ఏక ఉపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. డీఎస్సీ నియామక ప్రక్రియతో అక్కడ ఉపాధ్యాయుల కొరత తీరనుంది. గత కొంతకాలంగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు సర్కార్ మెగా డీఎస్సీ ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాధారణంగా టిడిపి ప్రభుత్వ హయాంలోనే డీఎస్సీ నోటిఫికేషన్లు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు మరోసారి టిడిపి కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంపై హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయి.