Chandrababu skill scam case: ఏపీ సీఎం చంద్రబాబుకు( AP CM Chandrababu) కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చంద్రబాబు పై ఒకేసారి ఆరు కేసులు నమోదయ్యాయి. అందులో ఐదు అక్రమాస్తుల కేసులు. ఒకటి హత్య ప్రయత్నం కేసు. అప్పట్లో ఈ కేసు విచారణ బాధ్యతలను సిఐడి చూసేది. కూటమి అధికారంలోకి రావడంతో ఒక్కో కేసును వెనక్కి తీసుకుంటుంది సిఐడి. ఎవరి ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారో.. వారితోనే కేసులు వెనక్కి తీసుకునేలా చేస్తుంది సిఐడి. వైసిపి హయాంలో అక్రమస్తుల కేసుల్లో చంద్రబాబు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. తొలుత ఈ కేసుల కొట్టివేతకు సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కుదరకపోయేసరికి బెయిల్ పిటిషన్ దాఖలు చేసి బయటకు వచ్చారు.
ఒక్కో కేసు నుంచి విముక్తి..
అయితే ఇప్పుడు ఒక్కో కేసు నుంచి ఆయన బయటపడుతున్నారు. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్( skill development scam) కేసుకు సంబంధించి సిఐడి వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫైబర్ నెట్, అమరావతి అసైన్డ్ ల్యాండ్స్, లిక్కర్ కేసు, ఇసుకకు సంబంధించిన కేసులు క్లోజ్ అయ్యాయి. చివరిగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసునకు సంబంధించి కూడా బయటపడేందుకు చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద దాఖలైన పిటిషన్ నేపథ్యంలో ఈ కేసు కూడా క్లోజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. సిఐడి క్లోజర్ రిపోర్టును పెట్టినట్లు సమాచారం. అయితే ఈ క్లోజర్ రిపోర్టును వ్యతిరేకించాలనుకుంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి కోర్టుకు వచ్చి చెప్పాలంటూ సిఐడి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వచ్చి సమాధానం చెప్పాలని సూచించింది. తద్వారా ఈ కేసు క్లోజ్ అవుతుందని స్పష్టం అవుతోంది.
అప్పట్లో వ్యూహం ప్రకారం..
అసలు ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబును ఇరికించారు అన్నది టిడిపి వాదన.. దానికి బలం చేకూర్చేలా ఇప్పుడు ఆ కేసులన్నీ క్లోజ్ అవుతున్నాయి. అప్పట్లో ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబుపై కేసులు నమోదు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ బేవరేజెస్, ఏపీ ఫైబర్ నెట్ వంటి వాటికి తన అస్మదీయ అధికారులను నియమించారు జగన్మోహన్ రెడ్డి. వారి ద్వారా 2014 నుంచి 2019 మధ్య అవినీతి జరిగిందని చూపించారు. ఇందులో చంద్రబాబు అంతిమ లబ్ధిదారుడు అంటూ కేసులు నమోదు చేయించారు. ఆపై అమరావతి అలైన్మెంట్ మార్పులో సైతం చంద్రబాబుకు హస్తము ఉందని చూపించడంలో అప్పటి అధికారులు క్రియాశీలక పాత్ర పోషించారు. ఆపై చేతిలో సిఐడి ఉండడంతో ఈ కేసులన్నీ చుట్టుముట్టాయి చంద్రబాబును. అలా ఈ అక్రమాస్తుల కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ కాగలిగారు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అయితే గతంలో ఎవరెవరు అయితే చంద్రబాబుపై ఫిర్యాదులు చేశారో.. ఆ ఫిర్యాదులు ఆధారంగా సిఐడి కేసులు నమోదు చేసిందో.. ఇప్పుడు అదే వ్యక్తులు ఫిర్యాదులను ఉపసంహరించుకున్నారు. సిఐడి కేసులను క్లోజ్ చేసేందుకు.. కోర్టులో క్లోజర్ రిపోర్టును పెడుతోంది. ఇప్పటివరకు దాదాపు అన్ని కేసులు క్లోజ్ అయ్యాయి. ఉన్నది కేవలం స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు. అయితే ఎండి వచ్చి అభ్యంతరం తెలిపితే కానీ ఈ కేసు క్లోజ్ కాకుండా ఉండదు. ఎండి వచ్చి అభ్యంతరం తెలిపే అవకాశం లేకపోవడంతో.. ఈ కేసు ఇక క్లోజ్ అయినట్టే.