Harsha Kumar on Rajamouli Issue: రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ నేతలకు అవి కనిపించడం లేదు. వాటిని ప్రస్తావిస్తే తమకు పెద్దగా ప్రచారం రాదు అన్నట్టు ఉన్నారు. అందుకే తిరుమల( Tirumala) వివాదాలపై మాట్లాడుతారు. మత విషయాలపై మాట్లాడుతారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలపై మాత్రమే వ్యాఖ్యలు చేస్తారు. కానీ చిన్న వాటిపై మాత్రం చేయరు. ఇప్పుడు దర్శకుడు రాజమౌళి పై మాట్లాడుతూ ప్రచారంలోకి వస్తున్నారు. వారణాసి ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్ని సృష్టించాయి. ముందుగా తెలంగాణలో దీనిపై వాదనలు సాగాయి. ఇప్పుడు ఆ సంస్కృతి తెలంగాణకు వచ్చింది. అయితే ఈ అంశంపై మాట్లాడుతున్న వారంతా ప్రచారంపై యావ ఉన్నవాళ్లు అని అర్థం అవుతోంది.
యధాలపంగా వ్యాఖ్యలు
రాజమౌళి( director SS Rajamouli) వారణాసి సినిమా ఈవెంట్ లో రాజమౌళి యధాలాపంగా మాట్లాడారు. హనుమంతుడి శక్తి పై అంత నమ్మకం లేదన్నట్టు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో రాజమౌళి చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. రాజమౌళి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్లు వినిపించాయి. లేకుంటే రాజమౌళి సినిమాలను బ్యాన్ చేస్తామని కూడా హెచ్చరికలు వచ్చాయి. అయితే రాజమౌళి స్పందించాలి అన్న డిమాండ్లు వచ్చాయి. అయితే ఇప్పటికే జరిగిన రాజకీయాలు చాలు.. నేను స్పందించను మహాప్రభు అంటూ రాజమౌళి సైలెంట్ అయిపోయారు.
లీడ్ తీసుకున్న హర్ష కుమార్..
అయితే ఇప్పుడు ఈ వివాదాన్ని లీడ్ తీసుకున్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్( Harsha Kumar) . అసలు రాజమౌళి తప్పు ఏంటని ప్రశ్నించారు. ఆయన ఏం తప్పు చేశారని నిలదీశారు. ఇందులో బిజెపిని తెరపైకి తెచ్చారు. ఇటీవల ఎందుకో హర్షకుమార్కు బిజెపి నచ్చడం లేదు. ఏపీలో తెలుగుదేశం పార్టీ నచ్చటం లేదు. కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే తెగ ఇష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు. ఆయన లైన్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజమౌళి వివాదాన్ని సైతం రాజకీయంగా మార్చాలని చూస్తున్నారు. అయితే ఈ వివాదం పై ఎవరూ మాట్లాడడం లేదు కానీ బిజెపి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దీంతో ఇది మరింత వివాదం అవుతోంది.
పాస్టర్ మృతితో అలా..
అయితే కొద్ది రోజుల కిందట పాస్టర్ కోయ ప్రవీణ్( paster Koya Pravin ) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చివరకు ఆయన మద్యం మత్తులో మృతి చెందారని నిర్ధారించారు పోలీసులు. మద్యం మత్తులో ప్రమాదానికి లోనయ్యారని ధ్రువీకరించారు. కానీ అప్పట్లో హర్ష కుమార్ ఈ ఘటనపై కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికిన మాదిరిగా రాజమౌళిని సమర్థిస్తున్నారు హర్ష కుమార్. కొద్ది రోజుల కిందట ఆయన పార్టీ అధ్యక్షురాలు షర్మిల.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత కాలనీలో వెంకటేశ్వర ఆలయాలు కట్టిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ సొమ్ముతో ఆలయాలు కడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అప్పుడు కనీసం నోరు తెరవలేదు హర్ష కుమార్. ఆయన తీరు చూస్తుంటే ఒక మతం వాయిస్ వినిపించేలా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే హర్ష కుమార్ ను వ్యతిరేకిస్తూ విష్ణు కుమార్ రెడ్డి ఇప్పుడు గట్టిగానే స్పందిస్తున్నారు. అప్పుడు తెరవని నోరు ఇప్పుడు ఎందుకంటే సెటైర్లు వేస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే ఏపీలో ఇటువంటి వివాదాలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు ఎంత మాత్రం మేలు చేయవన్న విషయాన్ని గుర్తించుకుంటే మంచిది.