YCP new slogan: సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం… ఇది సిగరెట్ ప్యాకెట్ పైనే ఉంటుంది. చాలామందిని ఆలోచింపజేస్తుంది కూడా. అయితే సిగరెట్ కు ఎడిక్ట్ అయినవారు మానుకో లేరు కానీ.. ఈ స్లోగన్ చదివిన వారు మాత్రం కాస్త దూరంగానే ఉంటారు. అయితే రాజకీయంగాను ఇప్పుడు అదే స్లోగన్ వినిపిస్తోంది. సాధారణంగా పొలిటికల్ స్లొగన్స్ బలంగా వెళ్తాయి ప్రజల్లోకి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో.. రావాలి జగన్.. కావాలి జగన్ అనే స్లోగన్ బలంగా వెళ్ళింది ప్రజల్లోకి. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు దోహద పడింది. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అనే నినాదం తో ముందుకు వెళ్ళింది తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో. ఘనవిజయం సొంతం చేసుకుంది. పొలిటికల్ స్లొగన్స్ తో పాటు రాజకీయ పార్టీల పాటలు ఇప్పుడు చాలా ప్రభావితం చేస్తున్నాయన్నమాట.
పయ్యావుల కొత్త మాట..
మరోవైపు తాజాగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఒక పొలిటికల్ స్లోగన్ ను బయటకు తీశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆరోగ్యానికి హానికరం అనే ట్యాగ్ ను జత చేశారు. ఈ రాష్ట్రానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హానికరం అన్న మాట అనేసారు. అది ఇప్పుడు టిడిపి కూటమి శ్రేణుల్లోకి బలంగా వెళ్ళింది. తటస్థులతో పాటు వైసిపి వ్యతిరేకులకు ఎంతగానో ఆకర్షిస్తోంది ఈ నినాదం. వైసిపి హయాంలో.. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో అని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి అనుకున్న స్థాయిలో దీనిపై రియాక్షన్ రాలేదు. క్రమేపి ఈ సైకో అనే పదం కూటమి పార్టీల వాడుక అస్త్రంగా మారిపోయింది. సామాన్యులు సైతం సైకో నినాదంతో వైసిపి చర్యలను తప్పుపట్టేవారు.
ఆ మాటలన్నీ ప్రజల్లోకి..
జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయింది అనే మాట కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సంక్షేమం పేరుతో అభివృద్ధిని మరుగున పడేసారన్న విమర్శ ఉంది. అప్పట్లో బీజేపీ నేత పురందేశ్వరి జగన్ చేసిన అప్పులను ప్రస్తావించారు. పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో.. అప్పుల ప్రభుత్వం అన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా డ్యామేజ్ చేసేది ఈ స్లొగన్స్. తాజాగా పయ్యావుల కేశవ్ చేసిన.. రాష్ట్రానికి వైసీపీ హానికరం అనే నినాదం కూడా.. ఓ రేంజ్ లో ప్రభావం చూపడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.