Gudivada Amarnath latest viral video: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) మీడియా ముందుకు వచ్చారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడతారంటే.. సొంత పార్టీ నేతలనే ఇరకాటంలో పెట్టేశారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై విశాఖ నేతలు చాలా మాటలు చెప్పుకొచ్చారు. నగరంలో నీళ్లన్నీ డేటా సెంటర్ కి పెట్టేస్తారని తేల్చేశారు. చాలా రకాల కాలుష్యం కూడా ఉంటుందని చెప్పారు. 200కు మించి ఉద్యోగాలు రావని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇలా మాటలు ఎవరు ఆడుతారో ఏపీ ప్రజలకు తెలుసు. ఆయనే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇప్పటికే గుడ్డు మంత్రిగా గుర్తింపు పొందారు అమర్నాథ్. సోషల్ మీడియాకు ఎనలేని వినోదాన్ని పంచారు. ఇప్పుడు విశాఖ గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా ఆయనను అలానే చూపించారు జగన్మోహన్ రెడ్డి. అమర్నాథ్ అలానే మాట్లాడుతారు కానీ.. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు అధినేత. దీంతో గుడివాడ అమర్నాథ్ బాధ అంతా కాదు.
తనకు తాను పలుచన చేసుకొని..
గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath) జనాల్లో పలుచన కావడానికి ఆయన వైఖరి కారణం. ఆయన చూసేందుకు యంగ్ డైనమిక్ గా ఉంటారు కానీ.. మీడియా ఇంటర్వ్యూలో వెకిలి నవ్వు.. ఏదో చెప్పబోయి ఏదో చెప్పడం.. వంటి కారణాలతో కామెడీ పీస్ గా మారిపోయారు. ఇప్పుడు కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయననే ప్రయోగిస్తున్నారు. తాను లాజిక్ గా మాట్లాడుతున్నానన్న ఆనందం తప్ప.. తన నోటి నుంచి వచ్చే సుభాషితాలు ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారన్న విషయాన్ని మరిచిపోతున్నారు గుడివాడ అమర్నాథ్. తాను ఐటీ శాఖ మంత్రిగా దావోస్ ఎందుకు వెళ్లలేదని అడిగితే అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని.. అక్కడకు వెళ్లి ఇబ్బందులు పడడం ఎందుకన్నట్టు మాట్లాడారు. పారిశ్రామిక పెట్టుబడుల గురించి వైసీపీ ఎమ్మెల్యేలే సభలో అడిగితే.. అప్పడాలు, పచ్చళ్ళ కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నామని సిల్లీగా చెప్పేశారు. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు.. ముదిగేందుకు సమయం పడుతుందని చెప్పి గుడ్డు మంత్రిగా మారిపోయారు.
మారిన స్క్రిప్ట్..
అయితే తాడేపల్లి( Tadepalli ) నుంచి వచ్చిన స్క్రిప్ట్ మారిపోవడంతో ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు గుడివాడ అమర్నాథ్. వైసీపీలో ఏదైనా మాట్లాడాలంటే తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పంపించాల్సిందే. అలా వచ్చిన స్క్రిప్ట్ ను చదివేశారు గుడివాడ. విశాఖలో నీళ్లన్నీ డేటా సెంటర్కు ఖర్చయిపోతాయని.. ఇక స్నానం చేయలేమని.. బోర్ల ద్వారా నీరు రాదని.. భూగర్భ జలాలు అడుగంటుతాయని అబ్బబ్బ ఎన్నెన్నో మాటలు చెప్పారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని అడ్డంగా బుక్కయ్యారు. అసలే గతంలో ఐటీ శాఖ మంత్రిగా పదవి నిర్వర్తించారు. ఎటువంటి పరిశ్రమలు తేకపోగా.. ఈ తరహా ఆరోపణలు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు నెటిజన్లు. వారికి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును ఆహ్వానిస్తున్నామని చెప్పుకొచ్చారు. దాంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని.. అది విశాఖకు రావడం వెనుక తమ కృషి ఉందని జగన్ చెప్పడంతో అడ్డంగా బుక్కయ్యారు గుడివాడ అమర్నాథ్. అసలే ఆయన విషయంలో అంతెత్తున ఎగసిపడుతుంది సోషల్ మీడియా ఆగ్రహం. అటువంటిది ఇక ఊరుకుంటుందా?
గూగుల్ బ్రాండ్ ను ముందు పెట్టి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందో జీవోలో చెప్పలేక పోయారు. ఈ సంస్థ వల్ల రాష్ట్రానికి, రెవెన్యూకి ఉపయోగం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ, ఉత్తరాంధ్ర విషయంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అందుకే ప్రచారమే… pic.twitter.com/xFYNOEnYbE
— YSR Congress Party (@YSRCParty) October 14, 2025