Great Andhra vs YSRCP: తెలుగులో ప్రధాన మీడియాతో పాటు డిజిటల్ మీడియా( digital media) కూడా తనదైన ముద్ర చాటుతోంది. ముఖ్యంగా కొన్ని వెబ్సైట్లు సైతం మెయిన్ మీడియాకు తలదన్నే రీతిలో ఉంటాయి. అందుకే రాజకీయ పార్టీలు సైతం ఈ వెబ్సైట్లను పెంచి పోషిస్తున్నాయి. అయితే తెలుగులో ఉన్న టాప్ పొలిటికల్ వెబ్సైట్లో గ్రేట్ ఆంధ్ర ఒకటి. నిత్యం ఆ వెబ్సైట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల కథనాలు వస్తుంటాయి. అందుకే ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ వెబ్సైట్ను వీక్షిస్తుంటాయి. చివరకు పార్టీ విధానాలు, పార్టీ వ్యూహాలు తెలుసుకునేందుకు ఆ వెబ్సైట్ను ఆశ్రయిస్తుంటాయి. అయితే ఇటీవల గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ రూటు మార్చినట్లు కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక్క రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి తో పాటు పార్టీని కీర్తిస్తూనే.. కొంతమంది నేతల వ్యవహార శైలి పై మాత్రం వ్యతిరేక కథనాలు రాస్తోంది. అది వైయస్సార్ కాంగ్రెస్ అభిమానులకు ఎంత మాత్రం రుచించడం లేదు.
సజ్జలపై కథనం..
తాజాగా గ్రేట్ ఆంధ్ర( great Andhra) వెబ్సైట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు వ్యతిరేకంగా కథనం వచ్చింది. ఆ కథనాన్ని చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. ఇటీవల మంగళగిరి లో జరిగిన ఓ మీడియా కాంక్లేవ్ లో ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అమరావతి రాజధానికి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పాలన సాగిస్తారని.. రైతుల నుంచి సేకరించిన ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తారని చెప్పుకొచ్చారు సజ్జల. అయితే ఇప్పటికే అమరావతి విషయంలో వ్యతిరేక ధోరణితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియాలో వస్తున్న కథనాలే దానిని తెలియజేస్తున్నాయి. అయితే సజ్జల పార్టీ లైన్ దాటి.. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా మార్చేశారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు గ్రేట్ఆంధ్రలో కథనం వచ్చింది. అంతా నీ ఇష్టంయేనా అన్నట్టు జగన్ తీవ్ర స్థాయిలో నిలదీసినట్లు ఆ కథనం సారాంశం. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోకి బలంగా వెళ్ళింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నట్లు గ్రేట్ఆంధ్ర కుట్ర చేస్తోందని ఆ పార్టీ అభిమాన నేతలు మీడియా ముందుకు వచ్చి ఖండిస్తున్నారు. గ్రేట్ ఆంధ్ర పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇదేం జర్నలిజం అని మండిపడుతున్నారు.
జగన్ విషయంలో సైతం..
కొద్ది రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) విషయంలో సైతం ఇదే తరహా కథనాన్ని రాసుకొచ్చింది గ్రేట్ ఆంధ్ర. అమరావతి పై జగన్మోహన్ రెడ్డి విషయం చిమ్ముతున్నారని తీవ్ర పదజాలం వాడింది. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకొచ్చింది. గతంలో జగన్ పై కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై కానీ ఈ తరహా కథనాలు రాసేది కాదు గ్రేట్ ఆంధ్ర. అయితే గ్రేట్ ఆంధ్ర మారిన వైఖరిని చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ నేత అయితే ఒక ప్రత్యేక వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి మెప్పు కోసం ఇలాంటి రాతలు రాస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎంత మాత్రం రుచించడం లేదు.
అవాస్తవ కధనాలను ఆపండి, గ్రేట్ ఆంధ్ర కౌవర్ట్ జర్నలిజం చేస్తోంది! pic.twitter.com/PGjHryKJn0
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) September 16, 2025