Great Andhra Against YCP: పత్రికలు, న్యూస్ చానల్స్ మాత్రమే కాదు..వెబ్ సైట్ లలో కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉంటాయి. అటువంటి వాటిల్లో గ్రేట్ఆంధ్ర కూడా ఒకటి. ఈ మాట అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. పైగా గ్రేట్ ఆంధ్ర వైసిపికి అనుకూలమైన న్యూస్ వెబ్సైట్ గా కొనసాగుతోంది. ఇదే విషయాన్ని వైసిపి నాయకులు అనేక అంతర్గత, బహిర్గత చర్చల్లో చెప్పుకున్నారు.. చెప్పుకుంటూనే ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రేట్ఆంధ్ర రాసిన రాతలు ఇప్పటికి కనిపిస్తూనే ఉంటాయి. వైసిపి అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా గ్రేట్ఆంధ్ర రాసిన రాతలు దర్శనమిస్తూనే ఉంటాయి. మొన్నటిదాకా వైసీపీకి అనుకూలమైన ధోరణి ప్రదర్శించిన గ్రేట్ ఆంధ్ర ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంతేకాదు గ్రేట్ఆంధ్రను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మొన్నటిదాకా ఒక ఇల్లు.. ఒకే సంవత్సరం లాగా సాగిన వ్యవహారం ఒకేసారి ఎందుకు మారిపోయింది.. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాలలో విస్తృతమైన చర్చకు దారితీస్తోంది.
గ్రేట్ ఆంధ్ర సోమవారం నాడు ఓ కథనాన్ని పబ్లిష్ చేసింది. అందులో వైసిపి అధినేత జగన్ ను ఉద్దేశించి తీవ్ర పదజాలాన్ని వాడింది. అమరావతిపై జగన్ విషం చిమ్ముతున్నాడని.. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని.. భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తున్నాడని గ్రేట్ ఆంధ్ర రాస్కొచ్చింది. వాస్తవానికి గ్రేట్ఆంధ్ర ఇలాంటి కథనం రాయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే వైసీపీ మీద అన్నిటికంటే ముఖ్యంగా జగన్ మీద కూడా వాలనీయకుండా గ్రేట్ఆంధ్ర చూసుకుంటుంది. ఒక రకంగా సాక్షి కంటే కూడా జగన్ కు అనుకూలంగా అక్షర యుద్ధాన్ని చేసింది గ్రేట్ఆంధ్ర. ఉన్నట్టుండి గ్రేట్ఆంధ్ర అలా వ్యవహరించడం.. కూటమికి అనుకూలంగా రాయడం సాధారణ వైసిపి కార్యకర్తకు మింగుడు పడలేదు. వాస్తవానికి సోషల్ మీడియాలో గ్రేట్ ఆంధ్ర పట్ల వైసీపీ నాయకుల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ.. అది ఊహించిన స్థాయిలో బహిర్గతం కాలేదు. కానీ వెంకట్ రెడ్డి అనే ఓ వైసిపి నేత మాత్రం ధైర్యం చేసి తన మనసులో గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని బహిర్గతం చేశారు.
“ఎవరి మెప్పు కోసం ఇలాంటి రాతలు రాశారు.. ఎవరి ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రాపగాండాకు తెరదీశారు. అమరావతి మీద జగన్ ఎప్పుడు విషం చిమ్మలేదు. అమరావతి అభివృద్ధిని జగన్ కోరుకున్నాడు. ఇటీవలి ఓ సభలో కూడా అదే విషయాన్ని చెప్పాడు. అమరావతి విషయంలో.. ఆంధ్రప్రదేశ్ విషయంలో విషం చిమ్మాల్సిన అవసరం జగన్ కు లేదు. మీరు ఎవరి ప్రయోజనాలు ఆశించి విషం చిమ్ముతున్నారు? ఇలాంటి రాతలు ఎందుకు రాస్తున్నారు? ఎవరి ప్రాపకం కోసం ఇలాంటి విధానాలకు పాల్పడుతున్నారు” అంటూ గ్రేట్ఆంధ్ర మేనేజ్మెంట్ ను ఉద్దేశించి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.. అంతేకాదు వచ్చే సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేల్చుతామని ఆయన స్పష్టం చేశారు. అడ్డగోలుగా రాతలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
గ్రేట్ ఆంధ్రా వాళ్ళను అడుగుతున్నా.
మీరు ఎవరిని ఇంప్రెస్ చేయటానికి ఏ ప్రయోజనాలను ఆశించి జగన్ గారి మీద విషం చిమ్ముతున్నారు.
– వెంకట్ రెడ్డి pic.twitter.com/hE8BZrR7hl
— Anitha Reddy (@Anithareddyatp) August 25, 2025