Alluri Sitaramaraju District: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోని ప్రాథమిక పాఠశాల లో ఉన్న విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పిందని చెప్పచ్చు.పాఠశాల భవనం పైకప్పు ఊడిపోయి ఒక్కసారిగా కింద పడటంతో పాఠశాల లో ఉన్న ఉపాధ్యాయులు,విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.అయితే అదృష్టవశాత్తు ఆ భవనం పైకప్పు ఊడిపోయి కింద పడిన సమయంలో ఆ ప్రదేశంలో విద్యార్థులు ఎవరు అక్కడ లేరు.
ఈ ఘటన కూనవరం మండలంలోని పెదర్కూరు పంచాయితీ పరిధిలోని బండారు గూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠాలలో జరిగింది.ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విద్యార్థులకు యథావిథిగా పాఠం చెప్తున్నా సమయంలో భవనం పై నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది.
శబ్దం వినిపించిన వెంటనే పైకప్పు ఊడిపోయి కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ఉపాధ్యాయురాలు మరియు విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.పాఠశాల గదిలో విద్యార్థులను కుర్చోపెట్టేందుకు టీచర్లు భయపడుతున్నారు.ఏం చేయాలో అర్ధం కాక స్కూల్ కు వచ్చిన పిల్లలను పాఠశాల ఆరు బయట కాంపౌండ్ లో చేప వేసి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు.
ఈ ఘటనపై వెంటనే అధికారులు స్పందించి భవన నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు.ఇప్పటికే శిధిలావస్థ కు చేరుకున్న భవనం గురించి అధికారులు కానీ నాయకులూ కానీ పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు.భారీ వర్షం పడిన సమయంలో భవనం నుంచి వర్షం నీరు కూడా పడుతుంది అంటూ టీచర్లు చెప్తున్నారు.