Google CEO Key Comments About Vizag: పర్యటకులకు స్వర్గధామంగా… విస్తారమైన సముద్రతీరంతో పర్యాటక ప్రాంతంగా పేరు పొందిన వైజాగ్ నగరం ఇప్పుడు మన దేశాన్ని దాటి.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నది. ఇటీవల ప్రఖ్యాత గూగుల్ సంస్థ 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో, 1 గిగా వాట్ సామర్థ్యంతో విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ డేటా సెంటర్ మొత్తం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడుస్తూ ఉంటుంది. ఈ డేటా సెంటర్ మనదేశంలో సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందని.. కృత్రిమ మేధ లో పెను మార్పులకు శ్రీకారం చుడుతుందని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దీనినిబట్టి విశాఖపట్నం నగరానికి ఉన్న స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
విశాఖపట్నం నగరం గురించి.. అక్కడ వచ్చే పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇటీవల కర్నూల్ లో నిర్వహించిన సభలో పేర్కొన్నారు. విశాఖపట్నం నగరానికి కూటమి ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పిస్తుందో వివరించారు. ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. గూగుల్ ఏఐ డాటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రకటన చేసిన తర్వాత.. మరిన్ని కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి సుముఖత వ్యక్తం చేశాయి. ఈ ప్రకారం చూసుకుంటే వైజాగ్ నగరం రూపురేఖలు మరికొద్ది రోజుల్లో మారే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పుడు విశాఖపట్నం నగరం గురించి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో వైజాగ్ నగరం గురించి తన మదిలో ఉన్న విషయాలను మొత్తం వెల్లడించారు..”విశాఖపట్నం కోస్టల్ టౌన్. వైజాగ్ బ్యూటిఫుల్ సిటీ. అక్కడ ప్రకృతి రమణీయత అందంగా ఉంటుంది. విస్తారమైన భూభాగం ఉంటుంది. ఆ ప్రాంతం అన్ని రకాల వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది.. అందువల్లే విశాఖపట్నం నగరంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో వన్ గిగా వాట్ సామర్థ్యంతో గూగుల్ కృత్రిమ మేధతో నడిచే సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద భారీ సమాచార కేంద్రం ఇదే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దూర దృష్టి ఉంది. ఆయనకు సాంకేతిక రంగాలపై పట్టు ఉంది. ఆయన అభిరుచి మేరకు గూగుల్ సంస్థ ఇక్కడ ప్రఖ్యాత సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని” సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.
ఇటీవల కర్నూల్ లో నిర్వహించిన జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఉత్సవం కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ రూపురేఖలను నారా లోకేష్ మార్చేస్తున్నారని కొనియాడారు. ఉన్నత విద్యను అభ్యసించిన నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి.. ఐటీ పురోగతికి వేగంగా అడుగులు వేస్తున్నారంటూ పేర్కొన్నారు. అంతేకాదు అంతటి బహిరంగ వేదికలో నారా లోకేష్ ను ప్రధాని తన దగ్గరికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ టాటా సెంటర్ కు సంబంధించి సుందర్ పిచాయ్ కీలక వీడియో విడుదల చేసిన నేపథ్యంలో.. దానిని తన వ్యక్తిగత సామాజిక మాధ్యమ ఖాతాలో ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పోస్ట్ చేయడం విశేషం.
#Vizag is beautiful.
Vizag will become the AI Hub Of India. #GoogleComesToAP #YoungestStateHighestInvestment @sundarpichai pic.twitter.com/wQNHBn2gFC— Lokesh Nara (@naralokesh) October 18, 2025