AP Government: కూటమి ప్రభుత్వం( Alliance government ) ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఏకకాలంలో తమకు అనేక విధులు అప్పగిస్తున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వారికి జాబ్ ఛార్జ్ ఖరారు చేసింది. ఆయా పనుల ప్రాధాన్యతలను కూడా తెలియజెప్పింది. ఏడు అంశాలతో పనులు కేటాయించిన ప్రభుత్వం.. జాబ్ ఛార్జ్ అమలు బాధ్యతను మాత్రం అధికారులకు అప్పగించింది. ఇటీవలే సచివాలయ ఉద్యోగుల బదిలీ జరిగిన సంగతి తెలిసిందే. అంతర్ మండలాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అదే సమయంలో అపరిస్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* ఆరేళ్ల కిందట..
వైసిపి( YSR Congress ) హయాంలో 2019లో సచివాలయ వ్యవస్థ ప్రారంభం అయింది. దాదాపు 12 శాఖలకు సంబంధించి కార్యదర్శుల నియామకాన్ని చేపట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. బదిలీలు చేపట్టింది. అయితే వాలంటీర్లు స్థానంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు సేవలు అందించాల్సి వస్తోంది. ఒకవైపు పాలనాపరమైన అంశాలు, ప్రభుత్వ సేవలు, ఇంటింటికి పింఛన్లు పంపిణీ వంటి వాటితో ఇబ్బంది పడుతున్నామని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో కొన్ని విధులను తొలగించాలని కోరుతున్నారు. ఏకకాలంలో అన్ని పనులు చేయలేమని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో సాధారణ జాబ్ చార్ట్ తో పాటు ఆయా శాఖలకు సంబంధించిన పనులపై ప్రభుత్వం స్పష్టత లిస్టు ఉత్తర్వులు జారీచేసింది.
* పౌరులకు ఇంటి వద్ద సంక్షేమ పథకాలు, సేవలను అందించాలని సూచించింది.
* సచివాలయాలకు వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించాలని నిర్దేశించింది.
* విపత్తులు సంభవించినప్పుడు మాత్రం సిబ్బంది హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.
* ఒకేసారి ఎక్కువ పనులు చేయాల్సి వస్తే జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి, సంబంధిత శాఖల జిల్లాల అధికారులతో చర్చించి.. కలెక్టర్ అనుమతితో పనుల ప్రాధాన్యత నిర్ణయిస్తామని పేర్కొంది.