Good news for Dwakra women: ఏపీలో( Andhra Pradesh) డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. డ్వాక్రా మహిళల ఇంట్లో పిల్లల చదువుకు సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఎన్టీఆర్ విద్యాసంకల్పం’ పేరుతో స్త్రీ నిధి బ్యాంకు ద్వారా నాలుగు శాతం వడ్డీకే పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అందించనుంది. కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు సంబంధించి ఈ పథకం వర్తించనుంది. పేద విద్యార్థుల చదువు కోసం ఈ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. మరోసారి మహిళా పక్షపాతిగా నిలిచింది. సెర్ఫ్ ఆధ్వర్యంలోని స్త్రీ నిధి బ్యాంక్ ద్వారా రుణాలు అందించనున్నారు. ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యాసంకల్పంగా పేరు పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. దీనికి సైతం ప్రభుత్వం ఓకే చెప్పింది.
Read Also: ఈ విషయంలో బెంగళూరు జట్టును అభినందించాల్సిందే.. ఇంతకీ ఏం చేసిందంటే
* పేద పిల్లల చదువు ప్రోత్సాహానికి..
ఇప్పటికే ఏపీలో డ్వాక్రా సంఘాల(Dwacra Associations) కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. సొంత అవసరాల కోసం డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకుంటారు. అయితే పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. అయితే స్త్రీ నిధి నుంచి తీసుకున్న రుణాన్ని పిల్లల చదువుకోసమే మాత్రమే ఉపయోగించాలి. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ కొనుగోలు చేయవచ్చు. సాంకేతిక విద్యకు కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చు. ఊరి నుంచి దూరంగా ఉండే విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులకు రవాణా సదుపాయం కోసం కూడా ఈ రుణాలు తీసుకోవచ్చు. అయితే స్త్రీ నిధి రుణాలను దేనికోసం ఖర్చు చేశారో ఆ రశీదులు స్త్రీ నిధి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
* వడ్డీ శాతం తగ్గింపు..
ప్రస్తుతం డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను( loans ) నెలవారీగా.. వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రుణాలను సైతం సులభ వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు. అయితే కేవలం నాలుగు శాతం వడ్డీకే ఈ రుణాలు ఇవ్వనున్నారు. పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. పిల్లల చదువుకు భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. త్వరలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం స్త్రీని డ్వాక్రా సభ్యులకు 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తోంది. కానీ పిల్లల చదువులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాలుగు శాతానికి వడ్డీ తగ్గించింది.
Read Also: కన్నప్ప సినిమాపై వివాదం
* నెలవారి చెల్లింపులు ఇలా
అయితే పిల్లల చదువు కోసం తీసుకున్న రుణాలను బట్టి.. వాయిదా పద్ధతులు( EMI ) ఉంటాయి. 24 నుంచి గరిష్టంగా 36 నెలల వరకు గడువు ఉంటుంది. ఈ పథకం కోసం ఏడాదికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల చదువు కోసం అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్న తల్లిదండ్రుల ఇబ్బందుల దృష్ట్యా.. ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పేద విద్యార్థులకు చేయూత అందించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 138 అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు రూ.11.52 కోట్లు విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో కేంద్రాన్ని రూ.12 లక్షలతో నిర్మించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.