Good News: ‘మద్యపానం హానికరం’ కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా బోర్డులు ఉన్నా.. మద్యం తాగే వారి సంఖ్య తగ్గడం లేదని చెప్పవచ్చు. పనిలో ఒత్తిడిని, మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు మద్యపానం మంచి మార్గమని చాలా మంది భావిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రోజుకు రెండు పెగ్గులు వేస్తుంటారు. మరి కొందరు పీపాలకు పీపాలు సేవిస్తుంటారు. ఈ క్రమంలో వైన్ షాప్ కు వెళ్లిన వారిని చూసి కొందరు షాపు నిర్వాహకులు ఇదే అదనుగా మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మద్యం సీసాలపై ఉన్న ఎంఆర్ పీ రేటు కంటే ఒక్క రూపాయి ఎక్కువకు విక్రయించినా రూ.10 వేల రూపాయల పరిహారం పొందవచ్చు. అదెలాగంటే?
వైన్ షాపునకు వెళ్లిన కొందరు ఒక్క సీసాతో సరిపెట్టుకోరు. మరో బాటిల్ కొట్టందే ఇంటి బాట పట్టరు. దీంతో మొదటి సీసా మత్తులో మరోసారి వైన్ షాప్ కి వెళ్లడంతో షాపు నిర్వాహకులు మద్యంను అత్యధిక రేటుతో విక్రయించే అవకాశం ఉంది. మద్యం బాటిల్ పై ఉన్న ఎంఆర్ పీ కంటే ఎక్కువగా విక్రయిస్తారు. మద్యం బాబులు మత్తులో ఉండడంతో ఆ విషయాన్ని పెద్దగా గుర్తించరు.ఇలా చాలాసార్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
ఒకవేళ వైన్ షాపు నిర్వహాకులు ఎంఆర్ పీ కంటే ఎక్కువ ధర తీసుకున్నారని గుర్తించినట్లయితే వారిని అక్కడే అడగండి. అయినా ఎదురు తిరిగితే ఓ పని చేయండి. Legal Metrology Act ప్రకారం మద్యంను ఎంఆర్ పీ కంటే ఎక్కువ రేటుకు అమ్మడానికి వీలు లేదు. ఒకవేళ అలా చేస్తే కన్జూమర్ కోర్టుకు వెళ్లవచ్చు. అలా కొనుగోలుదారులు ఫిర్యాదు చేసి ఎంఆర్ పీ కంటే ఎక్కువ రేటుకు మద్యం విక్రయించినట్లు తేలితే రూ.20,000 నుంచి రూ. లక్ష వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది.
గతంలో ఓ వైన్ షాపు నిర్వాహకుడు ఇలా అమ్మితే రూ.10,000 చెల్లించాలని కన్జూమర్ కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఎక్కువ ధరకు మరోసారి అమ్మితే భారీగా ఫైన్ వేస్తానని హెచ్చరించింది కూడా. అందువల్ల వైన్ షాపు నిర్వాహకులు ఎంఆర్ పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలిస్తే వెంటనే వారిని అక్కడే అడగండి. వినకపోతే కన్జూమర్ కోర్టుకు వెళ్లి ఫిర్యాదు ఇచ్చి రూ. 10 వేల వరకు పరిహారం పొందండి..