Free Gas: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. మార్గదర్శకాలు జారీ!

Free Gas: ఎన్నికల హామీ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధానంగా మహిళలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టునుంది. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.ముఖ్యంగా మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 850 రూపాయల వరకు ఉంది. మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ఏడాదికి ఒక్కో కుటుంబానికి 2500 రూపాయల లబ్ధి చేకూరనుంది.అందుకే మహిళలు ఈ పథకం పై ఎనలేని ఆసక్తి కనబరిచారు.కూటమి అధికారంలోకి రావడంతో ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూశారు.అయితే దీపావళి నుంచి అమలు చేస్తామని ముందుగానే ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు అర్హత,దరఖాస్తు, మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈనెల 24 నుంచి బుక్ చేసుకున్న వినియోగదారులకు ఆన్లైన్ విధానంలో ఉచిత గ్యాస్ పథకం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంక్ ఖాతాలో గ్యాస్ సబ్సిడీని జమ చేయాలని నిర్ణయించారు.

* రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర 870 రూపాయలుగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు 25 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర రూ.851 గా ఉంది. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పై 2684 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ ఐదేళ్లకు 13,423 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

* పేదరికమే ప్రామాణికంగా
అయితే కేవలం పేదరికం అనే ప్రాతిపదికగానే ఈ పథకం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఈ పథకం అమలు చేయనున్నారు. ప్రతి నెల రేషన్ కార్డు ద్వారా నిత్యవసరాలు పొందుతున్న వారు, స్థిర నివాసం ఉన్నవారికి అర్హులుగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా దీపావళి నాడు పండుగ వాతావరణం లో ఈ పథకం ప్రారంభం కానుంది.మొత్తానికి అయితే ఎన్నికల పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నమాట.

Get notified whenever we post something new!

Continue reading

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ పత్రాలతో భూకబ్జా కేసు వెంటాడుతోంది. ఈ క్షణం అయినా అరెస్ట్ జరుగుతుందన్న ఆలోచనతో తమ్మినేని ఫ్యామిలీతో సహా పరారీ అయ్యారు....

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టారు. అటువంటి నేత అరెస్టు భయంతో ఇప్పుడు కుటుంబ సభ్యులతో సహా...

AP School Hair Cut Rules: విద్యార్థులకు సరికొత్త హెయిర్ స్టైల్స్.. అలా వస్తామంటే కుదరదు!

AP School Hair Cut Rules: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పరిస్థితుల్లో పిల్లల విషయంలో మరో నిర్ణయం ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలురుకు ఒకే తరహాలో హెయిర్ కట్ విధించాలని విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version