Fraud in ANU: మీడియా మీడియా మాదిరిగా ఉండాలి. వార్తలను వార్తల లాగా ప్రచురించాలి. వాస్తవాలను వాస్తవాల మాదిరిగా బయటపెట్టాలి. అలా కాకుండా నచ్చినవారి కి ఒక విధంగా.. నచ్చని వారిపై మరొక విధంగా వార్తలు రాస్తే దానిని జర్నలిజం అనరు.
తెలుగులో ఈనాడు దినపత్రికకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా కొన్ని కథనాల విషయంలో ఈనాడు రాజీ పడదు అంటారు. మిగతా విషయాలలో మాత్రం ఈనాడు ఒక విధంగా రాస్తుంది అని గిట్టని వారు అంటారు. అలాంటి కథనం ఒకటి ఈనాడులో ప్రచురితమైంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల గురించి రాసిన అయినాడు కొన్ని విషయాలను మర్చిపోయింది. ఇప్పుడు అవే విషయాలను వైసీపీ నాయకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అక్కడ 7.50.. ఇక్కడ 20 అనే శీర్షికతో ఈనాడులో సరిగా రెండు రోజుల క్రితం ఒక కథనం ప్రచురితమైంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య విభాగంలో జరుగుతున్న దోపిడి గురించి ఈనాడు ఈ కథనాన్ని ప్రచురించింది.
“అప్పనంగా సొమ్ములు ఇచ్చేవారు మన వారైతే.. ఇలాంటి పరిస్థితుల్లో అయిన రద్దు చేకూరుతుందని” ఇలా గొప్పగా లీడ్ రాసి ఈనాడు కథనాన్ని ప్రచురించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూరవిద్య విభాగంలో ఎన్ టైటిల్మెంట్ చెల్లింపులకు సంబంధించి ఈనాడు కొన్ని విషయాలను రాసింది. ఈసీ ఆమోదం లేకుండానే గత వీసీ ఉత్తర్వులను సాకుగా చూపిస్తూ 9 ఏళ్ల పాటు దోచుపెడుతున్నారని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఈనాడు రాసింది.
జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన ఏడాది పరిపాలన కాలాన్ని పూర్తి చేసుకుంది.. ఆ ఐదు, ఇప్పటి ఏడాది కాలాన్ని పక్కన పెడితే.. అప్పట్లో అధికారంలో ఉన్నది వేరే ప్రభుత్వం కదా. అలాంటప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో కూడా దోపిడీ జరిగినట్టే కదా.. ఆ విషయాన్ని ఈనాడు ఎందుకు మర్చిపోయింది.. తమకు అనుకూలంగా ఉన్న వారిపై ఒక విధంగా.. అనుకూలంగా లేని వారిపై మరొక విధంగా రాసే ఈనాడు.. ఈ విషయాన్ని ఎలా మర్చిపోయింది? దోపిడీ కేవలం అప్పట్నుంచి సాగుతుందని చెప్పకుండా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని ఈనాడు రాయడం నిజంగా హాస్యాస్పదం.. ఇప్పుడు ఈనాడు రాసింది కాబట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని దూర విద్యా విభాగంలో అక్రమాలు ఆగిపోతాయా? దుర్మార్గాలు జరగకుండా ఉండిపోతాయా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.