Amaravati Iconic Tower Flood: రాజధాని అమరావతి మరోసారి వరద నీటిలో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులతోపాటు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గుంటూరు వైపు నుంచి రాజధాని అమరావతి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఒకేసారి జిల్లాలో 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో తాడికొండ మండలం లోని కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. పెదపరిమి వద్ద కోటేల్ల వాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్న వాగు, పాలవాగులు పొంగడంతో రహదారుల పైకి భారీగా నీరు చేరింది.
Also Read: కుప్పం లెక్కను పులివెందులలో సరిచేసిన బాబు!
చుట్టూ చేరిన వరద నీరు..
అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతంలో.. కీలక నిర్మాణాలు జరుగుతున్న చోట నీరు ప్రవేశించింది. వాగుల్లో వేల క్యూసెక్కుల నీరు ముందుకు సాగక అమరావతి నిర్మాణాల వైపు మీరు చొచ్చుకొచ్చింది. ముఖ్యంగా ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి పునాదుల్లో నీరు చేరింది. అయితే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతోనే ఇలా నీరు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ అమరావతి విషయంలో నిత్యం విషం చిమ్మే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదేపనిగా ప్రచారం చేయడం ప్రారంభించింది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు నీట మునిగాయని చెబుతోంది. వాస్తవానికి 2014లో అమరావతి రాజధానిని ఎంపిక చేసింది టిడిపి ప్రభుత్వం. సచివాలయం కోసం ఐదు టవర్ల రాఫ్టు ఫౌండేషన్ నిర్మాణం చేపట్టింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసింది. మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
Also Read: పులివెందులలో వైసిపి గల్లంతు.. ఇక కష్టమే!
అమరావతికి కొత్త కళ
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త కళ వచ్చింది. అప్పటి నిర్మాణాల విషయంలో నిపుణులతో అధ్యయనం చేయించింది. అప్పట్లోనే ఐకానిక్ టవర్ల చుట్టూ భారీగా వరద ఉండడంతో తోడించే ప్రయత్నం చేసింది. కానీ అప్పట్లో నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేయడంతో రాఫ్టు ఫౌండేషన్ చెక్కుచెదరలేదు. అయితే తాజాగా వరదలతో మరోసారి ఐకానిక్ టవర్స్ పునాదుల లో నీరు చేరింది. వాటిని తొలగించడం చాలా సులువు అని.. ఒకటి రెండు రోజుల్లో ఈ నీరు బయటకు వెళ్ళిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే కీలకమైన ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి తరచూ వరదల్లో చిక్కుకోవడం.. దానిపై సోషల్ మీడియాలో ప్రచారం జరగడం పరిపాటిగా మారింది.
బ్రేకింగ్ న్యూస్
నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం
ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు
రాయపూడిలో నిర్మాణం.. చెరువులా మారిన అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం
నిన్న రాత్రి వర్షానికి రాయపూడి గ్రామానికి వరద ముంపు
పెరుగుతున్న వరదతో మరింత పెరుగుతున్న నీరు pic.twitter.com/QRVEigx6XF
— Telugu Feed (@Telugufeedsite) August 13, 2025