Anakapalli : సముద్ర జీవరాశుల్లో ఔషధ గుణాలు అధికం. ప్రధానంగా మత్స్య సంపదలో చాలా రకాల చేపలను మందుల తయారీకి వినియోగిస్తారు. అటువంటి చేపల్లో ఈల్ ఫిష్ ఒకటి. అవి దొరికాయి అంటే మత్స్యకారుల్లో ఆనందానికి అవధులు ఉండవు.మత్స్యకారుల పంట పండినట్టే.అటువంటి అవకాశాన్ని దక్కించుకున్నారు అనకాపల్లి జిల్లాకు చెందిన మత్స్యకారులు. కుప్పలు తెప్పలుగా ఈల్ ఫిష్ వలలకు చిక్కడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లిన అనకాపల్లి మత్స్యకారుల వలలకు చిక్కాయి ఈ చేపలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ లోతమ బోటును దింపారు మత్స్యకారులు. వారి వలలో పొడవాటి పాములు మాదిరిగా ఉండే ఈల్ ఫిష్ బయటపడ్డాయి. ఈ చేపలు పొట్ట భాగంలో ఉండే తెల్లటి బుడగ లాంటి అవయవాన్ని మందుల తయారీకి ఉపయోగిస్తారు. దీని ధర మార్కెట్లో 300 వరకు పలుకుతుంది. ఒక్కో చేపలు పదుల సంఖ్యలో ఈ అవయవం ఉంటుంది. ఈ చేపలు చూసిన వెంటనే మత్స్యకారులు సంబరపడిపోయారు.
* ఔషధ గుణాలు అధికం
ఈ ఈల్ ఫిష్ లో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఈ చేపలు తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. చేపల్లో అమినోయాసిడ్స్ ఉంటాయి. ఈ ఆమ్లాలు శరీరం పెరుగుదల, బలానికి ఉపయోగపడతాయి. చేపలలో ఒమేగా-2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తపోటును నియంత్రించడంలో కూడా తోడ్పడతాయి. కొవ్వు చేపలలో ఉండే ఒమేగా 3కొవ్వు ఆమ్లాలు మెదడులోని న్యూరాన్ల అభివృద్ధిని స్థిరీకరించడంలో సహాయపడతాయి.ఇది మెదడు సామర్థ్యాన్ని శక్తిని పెంచుతుంది.ఈ చేపలలో ప్రో బయోటిక్స్ ఉంటాయి.ఇవి జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాలను పెంచుతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
– రంగంలోకి దళారులు
సాధారణంగా ఈ చేపలు వలలకు చిక్కవు. శీతాకాలంలోనే ఇవి చిక్కుతాయని మత్స్యకారులు చెబుతున్నారు.చూడడానికి పాములు మాదిరిగా కనిపిస్తాయి.పొడవుగా ఉంటాయి. అయితే వీటి కొనుగోలుకు ప్రత్యేకంగా వ్యాపారులు ఉంటారు. ఇలా కొనుగోలు చేసిన చేపలను మందుల తయారీ కంపెనీకి పంపించి సొమ్ము చేసుకుంటారు కొందరు. మత్స్యకారుల దగ్గర కొనుగోలు చేసిన దానికంటే మించి విక్రయిస్తుంటారు.