Excise Department: ఏపీలో( Andhra Pradesh) మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మరోవైపు బార్ల పాలసీని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. బార్ల అనుమతికి టెండర్లు ఇవ్వనుంది. దానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకోవైపు మద్యం షాపుల వద్ద పర్మిట్ రూములు రానున్నాయి. అక్కడే మద్యం తాగేందుకు వీలుగా ఈ పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు ఏపీలో కొత్త మద్యం బ్రాండ్ల ప్రవేశానికి అనుమతి నిరాకరించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్త బ్రాండ్ల మద్యానికి అనుమతి అంశంపై ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనల రూపొందించింది. అయితే ఇటీవల ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో కొత్త బ్రాండ్ల అనుమతికి సంబంధించి చర్చ సాగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త బ్రాండ్లు అవసరం లేదని సీఎం చంద్రబాబు తిరస్కరించినట్లు సమాచారం.
Also Read: ఎల్బ్రస్ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకం
* వైసిపి హయాంలో కొత్త బ్రాండ్లు..
వైసిపి( YSR Congress party ) హయాంలో ఊరు పేరు తెలియని బ్రాండ్లు పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. పాత ప్రీమియం బ్రాండ్లు పూర్తిగా రద్దు చేశారు. దీంతో పెద్ద దుమారమే నడిచింది. ఒక విధంగా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరగడానికి మద్యం విధానమే కారణం. అందుకే మద్యం విషయంలో చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే పాత ప్రీమియం బ్రాండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే గతంలో లభించిన ప్రీమియం బ్రాండ్ల విక్రయం జరుగుతోంది. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం కొత్త బ్రాండ్లను ప్రతిపాదించారు. అయితే అందులో చాలా వరకు సిమిలర్ సౌండింగ్ బ్రాండ్లే ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్ల పేర్లకు చిన్నపాటి మార్పులు చేసి కొత్త పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెడతారు. ఈ విధంగా స్వల్ప మార్పులతో వచ్చిన వాటిని కొత్త బ్రాండ్లు గాని పరిగణిస్తారు. వాటికి కొత్త ధరలు నిర్ణయిస్తారు. అయితే వైసిపి ప్రభుత్వం లో జరిగిన మద్యం స్కాంలో సిమిలర్ సౌండింగ్ బ్రాండ్లు కీలక పాత్ర పోషించాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. అందుకే తాజాగా ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు తిరస్కరించినట్లు తెలుస్తోంది.
* మళ్లీ అదే తప్పు..
అధికారులు చెబుతున్నట్టు సిమిలర్ సౌండింగ్ బ్రాండ్లను( similar sounding brands ) అనుమతిస్తే మళ్లీ అదే తప్పు చేసినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఈసారి అవే కంపెనీలు కొత్త పేర్లతో నాణ్యత తగ్గించి.. బ్రాండ్లను ప్రవేశపెట్టి అమ్మకాలు పెంచుకోవాలని భావించాయి. దీనిని గుర్తించిన సీఎం చంద్రబాబు కొత్త బ్రాండ్లు అవసరం లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న బ్రాండ్ల ధరల సవరణ టెండర్ల అంశం కూడా ఇటీవల క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపై త్వరలో ఆదేశాలు కూడా వెలువడనున్నాయి. టెండర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా వాటి ధరలను సవరించునున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత 40 బ్రాండ్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ధరలను తగ్గించాయి. మొత్తానికి అయితే ఆదిలోనే కొత్త బ్రాండ్లకు చెక్ చెప్పారు చంద్రబాబు.