https://oktelugu.com/

Chandrababu arrested : బాబు అరెస్టు అయ్యారు.. మీడియా ఆకాశానికి ఎత్తింది.. అయిననూ ఎన్నికల్లో ఓటమే ఎదురయింది

తమ కవరేజ్తో అదరగొట్టినప్పటికీ పచ్చ మీడియాకు ఫాయిదా దక్కలేదు. మొత్తానికి బాబ్లీ ప్రాజెక్టు మీద చంద్రబాబు చేసిన యుద్ధం.. ఈనాడు, జ్యోతి లో ప్రచారానికి మాత్రమే పరిమితమైంది.

Written By: , Updated On : September 10, 2023 / 02:52 PM IST
chandrababu arrest

chandrababu arrest

Follow us on

Chandrababu arrested : మీడియాకు, చంద్రబాబుకు అవినాభావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఈనాడు, జ్యోతికి సయామి కవలల లాంటి సంబంధం ఉంటుంది. ఆయనకు ఏం జరిగినా అవి రాస్తూ ఉంటాయి. ఏం చేసినా ప్రచారం చేస్తూ ఉంటాయి. మిగతా వారి విషయంలో నిప్పురవ్వలు చిమ్మే ఆ పత్రికలు బాబు పట్ల వినయ విధేయతలను ప్రదర్శిస్తుంటాయి. నిన్న చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత.. చాలామంది ఆయన అరెస్టు కావడం ఇదే మొదటిసారి అనుకున్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం అంటే భూమి, ఆకాశాన్ని ఏకం చేయడం అనుకున్నారు. కానీ జగన్ దాన్ని నిజం చేసి చూపించాడు. స్కిల్ డెవలప్మెంట్ ఉదంతంలో చంద్రబాబును అరెస్టు చేసినట్టు ఏపీ సిఐడి పోలీసులు వెల్లడించారు. కానీ అంతకుముందే చంద్రబాబు మహా అరెస్టు జరిగింది.

అది 2010.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. తెలంగాణ కోసం భారత రాష్ట్ర సమితి శాసనసభ్యులు రాజీనామా చేశారు. ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయి. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అభివృద్ధి మంత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రాజీనామా చేసింది తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సభ్యులు కాబట్టి.. వారు తెలంగాణ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు నినాదం లేదు. ఎందుకంటే చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని మర్చిపోలేదు కాబట్టి. అప్పటికప్పుడు పొలిటికల్ ఫాయిదా కోసం ఏదో ఒక నినాదాన్ని ఎత్తుకోవాలి కాబట్టి.. తెలుగుదేశం పార్టీ నాయకులు మహారాష్ట్ర పై దండెత్తాలి అనుకున్నారు. ఎందుకంటే అప్పుడు మహారాష్ట్ర బాబ్లీ అనే ప్రాంతంలో గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మించింది. దీనివల్ల తెలంగాణ ప్రాంతం ఎడారి అవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ వాదన. అయితే ఈ వాదనను తెలుగుదేశం పార్టీ తన భుజానికి ఎత్తుకుంది. ఉప ఎన్నికల్లో గెలవాలి అనే ఉద్దేశంతో విస్తృతంగా ప్రచారం మొదలుపెట్టింది. శత్రుదేశం పైకి దండెత్తిన తీరులో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మీడియాతో కలిసి చంద్రబాబు బాబ్లీ ప్రాంతానికి పయనమయ్యారు. చంద్రబాబు ప్లాన్ ఏమిటో అంతా రహస్యం. జూలై 16 2010న మహారాష్ట్రలో చంద్రబాబు బృందం రెండు ప్రత్యేక బస్సులలో అడుగుపెట్టింది. ఆ యాత్ర చూస్తే అచ్చం దండయాత్ర లాగానే ఉంది. చంద్రబాబు తర్వాత తెలంగాణ నాయకుల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకుల్లో పయ్యావుల కేశవ్, ఎంపీ నామా నాగేశ్వరరావు వంటి వారు ఉన్నారు. వారిలో పయ్యావుల కేశవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు.. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మించింది కాబట్టి.. దానివల్ల తెలంగాణ ఎడారిగా ఎలా మారుతుందో కళ్ళకు కట్టినట్టు వివరించారు.

వీరి రాకను పురస్కరించుకొని మహారాష్ట్ర సరిహద్దుల్లో సమీపంలో మహారాష్ట్ర పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఆంధ్ర నుంచి వచ్చిన చంద్రబాబు సైన్యాన్ని అక్కడే నిలువరించారు. ఇదే అదునుగా చంద్రబాబు ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు. “చూశారా? తెలంగాణ ప్రాంతం ఎడారి అవుతుంటే? మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఎలా నిలవరిస్తున్నానో” అనే రేంజ్ లో ఆయన ప్రసంగించారు.. సరిహద్దుల్లో కొంత సమయం చంద్రబాబు రాజకీయ ఉపన్యాసంతోనే సరిపోయింది. చంద్రబాబు ఉపన్యాసం అంటే అందులో ఎటువంటి మసాలా ఉండదు కాబట్టి.. గురులు కూడా లైట్ తీసుకున్నారు. లాఠీచార్జి, తోపులాట వంటివి జరగకపోయినప్పటికీ.. ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రం ఒక రేంజ్ లో రాసుకొచ్చాయి. బాబు యుద్ధం చేశాడు అంటూ కవరింగ్ ఇచ్చాయి. ఎటువంటి లాఠీచార్జ్ జరగకపోవడంతో చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలోకి ప్రవేశించారు. అక్కడి పోలీసులు అరెస్టు చేసి.. ధన్ బాద్ లో ఒక విద్యాసంస్థలో ఉంచారు. ఇక మరుసటి రోజు చూడగానే హైదరాబాద్ ప్రాంతం మొత్తం చంద్రబాబు ఫ్లెక్సీలతో నింపేశారు. బాబుని జైలు ఊచల మధ్య ఉంచి ఫోటోలు రూపొందించారు. ఆ ఫోటోలను ఫ్లెక్సీలుగా ముద్రించి భారీ ఎత్తున ప్రచారం చేశారు. వాస్తవానికి ధన్ బాద్ ప్రాంతంలో అలాంటివేవీ జరగలేదు. చంద్రబాబు కోరుకున్న సానుభూతి కోసం టిడిపి వర్గాలు తెగ ప్రయత్నాలు చేశాయి. జ్యోతి, ఈనాడు చాలావరకు చించుకున్నాయి. కానీ ఉప ఎన్నికల్లో టిడిపి గెలవలేదు. తమ కవరేజ్తో అదరగొట్టినప్పటికీ పచ్చ మీడియాకు ఫాయిదా దక్కలేదు. మొత్తానికి బాబ్లీ ప్రాజెక్టు మీద చంద్రబాబు చేసిన యుద్ధం.. ఈనాడు, జ్యోతి లో ప్రచారానికి మాత్రమే పరిమితమైంది.