Eenadu : కోడి, కుక్క.. ఓ సీమ వార్త.. దిగజారిపోయిన ఈనాడు విలువ

రేపు టీడీపీ అధికారంలోకి వచ్చినా సాక్షిలో ఇంతకు మించి వ్యతిరేక కథనాలు వస్తాయి. ఎల్లో, నీలి, కూలి మీడియాల వైఖరే అలా ఉంటుంది. అక్కడ పవర్ మారిన ప్రతిసారి ఈ సెక్షన్ ఆఫ్ మీడియాల ప్రాధాన్యతలే మారుతాయి. అంతకు మించి మరేమీ ఉండదు.

Written By: Dharma, Updated On : July 17, 2023 7:18 pm
Follow us on

Eenadu : ఈనాడు.. తెలుగునాట ఈ పత్రికది ప్రత్యేక స్థానం. అధినేత రామోజీరావుకు రాజకీయ అజెండా ఉన్నా పాఠకాదరణలో మాత్రం ఈ పత్రిక ముందు వరుసలో ఉంది. అన్నివర్గాలకు అవసరమైన వార్తలను అందిస్తూ పాఠకాదరణ పెంచుకుంటూ వస్తోంది. ఆ స్థాయిలో స్టాండర్డ్స్ పాటిస్తూ వస్తోంది. అయితే ఇటీవల మాత్రం గాడి తప్పుతోంది. విపరీతమైన రాజకీయ అజెండాతో ముందుకెళుతూ వార్తల ప్రాధాన్యంలో తప్పటడుగులు వేస్తోంది. చివరకు ఇంటి వద్ద కుళాయి తగదాలను సైతం రాజకీయ రంగు అంటగట్టి వార్తలు ప్రచురిస్తోంది. కోడి కుక్క.. ఓ సీమ పేరిట ఈనాడులో వచ్చిన వార్త జుగుప్సాకరంగా ఉంది.

వైఎస్సార్ కడప జిల్లాలోని ఓ గ్రామంలో టీడీపీ సానుభూతిపరుడికి చెందిన కోడిని.. వైసీపీ సానుభూతిపరుడి కుక్క కరిచింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం ప్రారంభమైంది. చినికిచినికి గాలివానలా మారి కొట్లాటకు దారితీసింది. దీంతో ఇరువర్గాల మధ్య కేసు నమోదైంది.బాధితులకు వారి వారి పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ వార్తను ప్రధాన సంచికల్లోప్రచురించింది ఈనాడు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనతో పాటు ఎన్నో ప్రాధాన్యతాంశాలు పక్కకు వెళ్లిపోయాయి. కోడి, కుక్క వార్తే పతాక శిర్షీకన వచ్చింది. ఈ వార్తను చూసిన చాలామంది పాఠకులే రామోజీరావు మరీ ఇంతలా దిగజారిపోయారా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

రామోజీరావు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక బ్రాండ్. ఒక మీడియా సంస్థ అధిపతిగా, వ్యాపారవేత్తగానే కాకుండా.. అంతకుమించి అన్నంతగా ఆయన తన పేరు ప్రఖ్యాతలను విస్తరించుకున్నారు. బలమైన రాజకీయ ప్రత్యర్థులను కూడా సునాయాసంగా ఎదుర్కొన్న ధైర్యశాలి రామోజీరావు. కానీ పత్రికల విషయంలో కొన్ని స్టాండర్స్డ్ పాటించేవారు. కానీ ఇటీవల విపరీతమైన రాజకీయ అజెండాతో ముందుకెళుతున్నారు. రాయలసీమలో తరచూ జరిగే ఫ్యాక్షన్ గొడవలు, గ్రామ తగాదాలను సైతం రచ్చకెక్కించడం మాత్రం రాజగురువు రాజసానికి తగ్గట్టుగా లేదు.

వచ్చే పది నెలల పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఇలానే ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకుంటే ఈ రాష్ట్రంలో బతకలేం అన్నట్టు కథనాలు వండి వార్చుతాయి. ఈ రాష్ట్రం నుంచి బయటకు వెళ్లిపోవడమే తప్ప మరో మార్గం లేదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో కోడి, కుక్క లాంటి చిత్ర విచిత్ర తగాదాలను భూతద్ధంలో చూపిస్తారని సెటైర్లు పడుతున్నాయి. అయితే ఏ మీడియా అయినా ఇంతే. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చినా సాక్షిలో ఇంతకు మించి వ్యతిరేక కథనాలు వస్తాయి. ఎల్లో, నీలి, కూలి మీడియాల వైఖరే అలా ఉంటుంది. అక్కడ పవర్ మారిన ప్రతిసారి ఈ సెక్షన్ ఆఫ్ మీడియాల ప్రాధాన్యతలే మారుతాయి. అంతకు మించి మరేమీ ఉండదు.