Rajya Sabha Election: ఏపీలో మరో ఎన్నికకు నగరా మోగింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి ఎన్నికలు నిర్వహించాలని జాతీయ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. వైసీపీ నుంచి గెలిచిన ఈ ముగ్గురు రాజకీయ పరిణామాల నేపథ్యంలో పదవులకు రాజీనామా చేశారు. పదవులతో పాటు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఈ మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.
* నాలుగు రాష్ట్రాల్లో
ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభకు సంబంధించి ఖాళీలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఏపీ ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, హర్యానాలో ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించింది ఈ సి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. అయితే ఏపీలో ఖాళీ అయిన ఈ మూడు స్థానాలను కూటమి గెలుచుకోనుంది. ఎందుకంటే కనీస స్థాయిలో కూడా వైసీపీకి సీట్లు దక్కలేదు.అందుకే ఈ మూడు స్థానాలు ఏకగ్రీవం అయినట్టే.
* పెరగనున్న ప్రాతినిధ్యం
ప్రస్తుతం రాజ్యసభలో ఏపీ నుంచి ఒక్క వైసీపీకి ప్రాతినిధ్యం ఉంది. ఆ పార్టీకి 11 మంది సభ్యులు ఉండేవారు. ముగ్గురు రాజీనామాతో ఆ సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. మిగతా వారిలో సైతం చాలామంది పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం సాగింది.అయితే తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. అయితే ఈ మూడు స్థానాలను టిడిపి దక్కించుకుంటుందా?లేకుంటే జనసేన, బిజెపికి చెరి ఒకటి ఇస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ec schedule released for three rajya sabha seats in ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com