https://oktelugu.com/

Hebah Patel: తెలుగులో ఇప్పటివరకు 16 సినిమాలు చేస్తే… రెండు మాత్రమే హిట్.. చివరకు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తున్న బ్యూటీ…

సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే సూపర్ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

Written By:
  • Mahi
  • , Updated On : January 9, 2025 / 02:25 PM IST

    Hebah Patel

    Follow us on

    Hebah Patel: సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది ఎన్నో ఆశలతో,కలలతో హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తుంటారు.కానీ ఒకసారి సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ గా రాణించడం అంటే సాధారణమైన విషయం కాదు. హీరోయిన్ గా అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే ఆ అవకాశాలను నిలబెట్టుకొని హిట్ అందుకోవడం మరొక ఎత్తు. ఒక్కోసారి చేసిన మొదటి సినిమాతోనే హిట్ అందుకొని మంచి గుర్తింపును తెచ్చుకుంటారు.అలా సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే సూపర్ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.అలాగే కొంత మంది హీరోయిన్ లు ఎన్ని అవకాశాలు వస్తున్నా సక్సెస్ కాలేకపోతున్నారు.ఈ క్రమం లోనే కొంతమంది మాత్రం సినిమా అవకాశాలు వస్తున్నా కూడా సరైన హిట్టు లేక సతమతం అయిపోతున్నారు. సినిమా అవకాశాలు వచ్చి వరుసగా సినిమాలు చేస్తున్న కూడా ఇప్పటివరకు సాలిడ్ హిట్ అందుకోలేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. ఈ అమ్మడు తెలుగులో 16 సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ అందులో కేవలం రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. దాంతో ఈ అమ్మడు సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించడానికి రెడీ అయింది. సెకండ్ హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించినప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దాంతో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది.

    ఈ హీరోయిన్ మరెవరో కాదు హెబ్బా పటేల్. ఈమె గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అలా ఎలా అని సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్.మొదటి సినిమా తో హెబ్బా పటేల్ కు అంతగా గుర్తింపు రాలేకపోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన కుమారి 21 ఎఫ్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే హెబ్బా పటేల్ పేరు మారుమోగిపోయింది.కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత ఆమె క్రేజ్, ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయాయి అని చెప్పడం లో సందేహం లేదు.

    ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమా తర్వాత హెబ్బా పటేల్ వరుసగా అవకాశాలను అందుకుంది. కానీ సక్సెస్ మాత్రం అందుకోలేదని తెలుస్తుంది. హెబ్బా పటేల్ కు సోషల్ మీడియా లో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత హెబ్బా పటేల్ మా నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్ అనే సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం కాలేకపోయింది. దాంతో ఈమె ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తుంది.