Duvvada-Divvela Romance: తెలుగు రాష్ట్రాల్లోనే సెలబ్రిటీలు గా మారిపోయారు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. ఓ పొలిటికల్ లీడర్ గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురితో చెట్టాపట్టాల్ వేసుకోవడం సంచలనంగా మారింది. ఆ కుటుంబంలో కలతలు చెలరేగాయి. దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి విషయంలో రచ్చ నడిచింది. భార్య వాణి, ఇద్దరు పిల్లలు రావడంతో వివాదం రేగింది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్.. తన ప్రేయసి మాధురికి కొత్త ఇంటిని రాసిచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల్లో పోటీ చేసిన క్రమంలో.. దివ్వెల మాధురి భారీగా పెట్టుబడి పెట్టినట్టు.. ఆమె దగ్గర అప్పు చేసినట్టు చూపించి ఆమె పేరిట ఆ కొత్త ఇంటిని రాసిచ్చారు. అప్పటినుంచి కుటుంబంతో కోర్టు వివాదం నడుస్తుండగా.. దివ్వెల మాధురితో వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టారు దువ్వాడ శ్రీనివాస్. అయితే తరచూ ఈ జంట రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తుండగా.. తాజాగా రొమాన్స్ చేస్తూ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజకీయ విమర్శలు
అయితే ఇటీవల శ్రీకాకుళం వచ్చింది ఈ జంట. ప్రస్తుతం ఏ పార్టీలో లేరు దువ్వాడ శ్రీనివాస్. పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్కు గురయ్యారు. అయితే తన సస్పెన్షన్ కు ధర్మాన సోదరులు కారణమని.. వచ్చే ఎన్నికల్లో తన ప్రతాపం చూపుతానంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు దువ్వాడ శ్రీనివాస్. ఏకంగా శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టి తన రాజకీయ ప్రత్యర్థులైన కింజరాపు కుటుంబంతో పాటు వైసీపీలో తనను అణచివేసిన ధర్మాన బ్రదర్స్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అయితే అక్కడ నుంచి మళ్లీ హైదరాబాద్ వెళ్ళిపోయారు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట రొమాన్స్ కు సంబంధించి వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది.
హాట్ హాట్ గా కనిపిస్తూ..
దువ్వాడ శ్రీనివాస్ తో మాధురి చేస్తున్న రీల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. సినీ సెలబ్రిటీస్ కు మించి ఈ జంట పాపులర్ అయ్యారు. నిత్య నూతనంగా.. సరికొత్తగా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు కేక్ తినిపిస్తూ.. హాట్ హాట్ గా కనిపిస్తూ.. న్యూ కపుల్ గా రొమాన్స్ చేస్తూ కనిపించారు ఈ వీడియోలో. అయితే ఈ వీడియో పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Most happiest couple velle ankunta. pic.twitter.com/tkv2F9MCml
— Likitha. (@SRKTweetDiary) August 31, 2025