spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Driver Subrahmanyam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సంచలనం.. అజ్ఞాతం వీడిన 'ఆమె

Driver Subrahmanyam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సంచలనం.. అజ్ఞాతం వీడిన ‘ఆమె

Driver Subrahmanyam Case: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఆయనపై పోలీసుల అప్పట్లో కేసు నమోదు చేశారు. అరెస్టు కూడా జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఈ కేసు విచారణ నత్త నడకన సాగింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో కేసు వేగవంతంగా విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో అనంత బాబు సతీమణి లక్ష్మీ దుర్గ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఆమె నిందితురాలుగా చేర్చారు. మరోవైపు ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ తో పాటు కోర్టు విచారణకు హాజరుకావాలని సూచించింది. దీంతో అజ్ఞాతం వీడిన ఆమె ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట విచారణకు హాజరైంది.

Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!

* ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ..
వైసిపి హయాంలో ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు ( MLC anantababu )వద్ద డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో అనంతబాబు అరెస్టయ్యారు. కూటమి అధికారంలోకి రావడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ప్రారంభించింది. అయితే ఈ హత్యలో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ పాత్ర కూడా ఉందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆమెను ఎ2 నిందితురాలిగా చేర్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు లక్ష్మీ దుర్గ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యారు. సిట్ ప్రధాన అధికారిగా ఉన్న ఎస్ డి పి ఓ మనీష్ పాటిల్ దేవరాజ్ కార్యాలయంలో ఆమెను విచారించారు. గత కొంతకాలంగా లక్ష్మీ దుర్గ అజ్ఞాతంలో గడుపుతూ వచ్చారు. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయితే దానిని కొట్టివేయాలని కోరుతూ లక్ష్మీ దుర్గ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈనెల 16 నుంచి 30 వరకు సీట్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈనెల 30 తరువాత రాజమండ్రి కోర్టు ముందు హాజరుకావాలని కూడా తీర్పు చెప్పింది. దీంతో ఆమె అజ్ఞాతం వీడి ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు.

* పక్కా ఆధారాలతో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో 2022 మే 19న సుబ్రహ్మణ్యం( Subramanyam ) హత్య జరిగింది. ఆ తరువాత తన కారులో అ మృతదేహాన్ని ఇంటికి పంపించారు అనంతబాబు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో లక్ష్మీ దుర్గ అక్కడే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన తర్వాత భర్త అనంత బాబుతో కలిసి కారులో ఇంటికి రావడం సీసీ పూటేజీలో స్పష్టంగా రికార్డయింది. అయితే హత్య జరిగిన రోజు తాను స్థానికంగా లేనని.. బంధువులకు అస్వస్థతగా ఉండడంతో పరామర్శించేందుకు వెళ్లినట్లు ఆమె పోలీస్ విచారణలో తొలిసారి చెప్పింది. అయితే పోలీసులు పక్కా ఆధారాలు సేకరించడంతో ఇప్పుడు సరెండర్ కావాల్సిన అనివార్య పరిస్థితి. ఈ 15 రోజులపాటు ఆమె విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. చూడాలి ఫైనల్ గా ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version