Dramatic jailbreak caught on camera: ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో ఇద్దరు ఖైదీలు ఏకంగా జైలు హెడ్ వాటర్ పై దాడికి దిగారు. తలపై సుత్తితో కొట్టి తాళాలు తీసుకుని పారిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉమ్మడి విశాఖ.. ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే ఇద్దరు ఖైదీలు ఈ ఘటనకు పాల్పడగా.. అందులో పింఛన్ డబ్బులు కాజేసిన పంచాయితీ మాజీ కార్యదర్శి ఉండడం విశేషం. వీరి కోసం పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తీవ్రంగా గాయపడిన జైలు వార్డర్ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సినిమా తరహా ఘటన చోటు చేసుకోవడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
రిమాండ్ లో ఉండగా..
జైలులో బెజవాడ రాము( baijwada Ramu) అనే వ్యక్తి దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నక్క రవికుమార్ అనే వ్యక్తి పెన్షన్ డబ్బులు కాజేయడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. పంచాయితీ కార్యదర్శి ఉద్యోగం పోయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు వ్యక్తులు జైలులోనే ఉన్నారు. అయితే ఆరోజు ఆ ఇద్దరూ కలిసి జైలు కిచెన్ లో పనిచేస్తున్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే వార్డర్ రాజు పై ఒక్కసారిగా దాడి చేశారు. ఓ సుత్తి తీసుకొని పలుమార్లు కొట్టడమే కాకుండా.. అక్కడ ఉన్న తాళాలు తీసి బయటకు పారిపోయారు. అయితే వార్డర్ తన విధుల్లో ఉండగా ఒక్కసారిగా దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. ముందుగా ఒకరు వచ్చి సుత్తితో దాడి చేశారు. మరొకరు పారిపోయారు. అయితే వార్ధర్ రాజు అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ ఇద్దరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడ నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.
సోషల్ మీడియాలో వైరల్..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో( social media) వైరల్ అవుతోంది. అయితే ఆ ఇద్దరూ కరుడుగట్టిన నిందితులు మాత్రం కాదు. మరి బయటకు పారిపోయేందుకు ఎందుకు ప్రయత్నించారో తెలియడం లేదు. పైగా ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. వార్డర్ తన పని తాను చేస్తుండగా.. ఒక్కసారిగా దాడి చేయడంతో హతాశుడయ్యాడు. ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతం అయ్యాడు. ప్రస్తుతం ఆ ఇద్దరూ పరారీలో ఉండగా.. జైలు అధికారి మాత్రం ఆసుపత్రి పాలయ్యారు.
Need to strengthen security in Jails. Two remands prisoners escaped from Chidavaram Sub Jail of Anakapalli district( Andhra Pradesh) – authorities are trying to nab them . pic.twitter.com/MDh32nGOX1
— Dr Srinubabu Gedela (@DrSrinubabu) September 5, 2025