Roja: ఓడిపోతున్నానని రోజాకు అర్థమైందా? అందుకే ఆ మాటలా?

నగిరి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రోజాకు వ్యతిరేక వర్గం ఉంది. వారు రోజాకు టికెట్ కూడా ఇవ్వవద్దని చెప్పారు. కానీ జగన్ మాత్రం రోజాకు జడిసి టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 14, 2024 11:36 am

Roja

Follow us on

Roja: మంత్రి రోజా ముందే చేతులెత్తేశారా? ఓటమికి సాకులు వెతుకుతున్నారా? అందులో భాగంగానే సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పోలింగ్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన రోజా సొంత పార్టీ నేతలు తనను ఓడించే ప్రయత్నం చేశారని చెప్పడం విశేషం. అయితే సొంత పార్టీ నేతలను పట్టించుకోని ఆమె.. పోలింగ్ తరువాత ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రచారం వరకు అసలు వారిని పట్టించుకోని రోజా.. ఇప్పుడు వారి పేర్లు బయట పెట్టడం ఆలోచించాల్సిన విషయమే.

నగిరి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రోజాకు వ్యతిరేక వర్గం ఉంది. వారు రోజాకు టికెట్ కూడా ఇవ్వవద్దని చెప్పారు. కానీ జగన్ మాత్రం రోజాకు జడిసి టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అసంతృప్త నాయకులతో సర్దుబాటు చేసుకోవాలని స్వయంగా హై కమాండ్ సూచించినా.. రోజా పెద్దగా వినలేదు. వారిని లెక్క చేయలేదు. జగన్ ప్రభంజనంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో గెలిచేస్తానని ధీమాతో ఉండేవారు. వారు సహకరించకపోయినా పర్వాలేదన్న రీతిలో వ్యవహరించారు.

అయితే పెరిగిన పోలింగ్ శాతం, అర్ధరాత్రి వరకు క్యూలైన్లో ఓటర్లు బారులు తీరడంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వైసీపీ నేతలు విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. అందులో భాగంగానే రోజా మీడియా ముందుకు వచ్చారు. ఒక్క పెద్దిరెడ్డి పేరు చెప్పలేదు కానీ.. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో పదవులు చేపట్టిన నాయకుల పేర్లను బయటపెట్టారు రోజా. వారంతా తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కనీసం ప్రచారం కూడా సొంత పార్టీ నేతలను రోజా పిలవలేదు. ఇప్పుడు ఆ నేతలే తనను ఓడించాలని చెప్పడం ద్వారా బేలతనాన్ని చూపించుకున్నారు రోజా. మొత్తానికైతే ఓటమిని ముందే ఒప్పుకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.