Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను ఉన్నత స్థానంలో నిలిబెట్టాయి. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా కొనసాగుతున్నప్పటికీ సినిమాలపరంగా కూడా తను అసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రేపు జరగబోయే ఎలక్షన్స్ లో భాగంగా ప్రతి పార్టీ కూడా చాలా వరకు ప్రచారాలను కొనసాగించి ఎవరికి వాళ్లు విజయాలను సాధించాలని జెండా ఎగరవేయాలని చాలా కష్టపడ్డారు.
ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే… అయితే ఈసారి పవన్ కళ్యాణ్ మాత్రం భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న ఉంగరాలు ప్రస్తుతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. అందులో ఒకటి తాబేలు ఉంగరం కాగా, మరొకటి నాగబంధం ఉన్న ఉంగరం కావడం విశేషం…ఇక తాబేలు ఉంగరం అభివృద్ధికి, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం దాన్ని వాడుతారని, అలాగే నాగబంధం ఉన్న ఉంగరం మనకు వచ్చే గండాల నుంచి పీడల నుంచి తొలగించడానికి దానిని ఎక్కువగా వాడుతుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా శాస్త్రాలని, జ్యోతిష్యాలను కూడా నమ్ముతాడనేది ఈ విషయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ సెలబ్రెటీలు సైతం మద్దతు పలకడం విశేషం అనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటూ జనంలో కలిసిపోతూ తిరుగుతున్నాడు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈసారి గెలుపు ఒకటే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగాడు కాబట్టి అతనికి మద్దతుగా మెగా ఫ్యామిలీతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు సైతం ప్రచారం చేపడుతూ పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి అని కోరుకుంటున్నారు…