Divvela Madhuri : ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం ఇంకా కొలిక్కి రావడం లేదు. గత పది రోజులుగా ఆ కుటుంబ వివాదం మీడియాకు ఆహారంగా మారింది. సోషల్ మీడియాకు చెప్పనవసరం లేదు. దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి, స్నేహితురాలు దివ్వెల మాధురి, ఆమె భర్త.. ఇలా రోజుకొకరు మీడియా ముందుకు వచ్చి వినోదాన్ని పంచుతున్నారు. ఇక మాధురి గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో ఎక్కువగా ఆమె గురించి ట్రోల్ అవుతోంది. ఆమె ఇనిస్టా లోని వీడియోలు, తాజాగా చేసిన వ్యాఖ్యలు, పాత ఘటనలకు సంబంధించి వీడియోలు, ఆడియోలు.. ఇలా ఒకటేమిటి.. ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా కొన్ని మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు అయితే అదే పనిగా ప్రసారాలు చేస్తున్నాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన దివ్వెల మాధురి అయితే నేరుగా లైవ్ లోనే పాల్గొంటున్నారు. మీడియా అడిగిన వాటికి నేరుగా సమాధానాలు చెబుతున్నారు. పెళ్లి గురించి ప్రస్తావించేసరికి చిరునవ్వులు చిందించారు. ఇప్పటికిప్పుడు మ్యారేజ్ ప్రపోజల్స్ తో దువ్వాడ శ్రీనివాస్ వస్తే ఏం చేస్తారు.. అని యాంకర్ అడిగేసరికి చిరునవ్వులతో ఆహ్వానించారు మాధురి. అంతదాకా వస్తే చూద్దాంలే అంటూ దాటవేశారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఏమి ఇష్టం?మీరు పాడితేనే ఇష్టమా? డాన్స్ చేస్తే ఇష్టమా? మీరు పాడే ఈ పాటకు ఇష్టపడతారు? ఏ పాటకు డాన్స్ చేస్తే ఇష్టపడతారు? వంటి ప్రశ్నలు మీడియా యాంకర్ నుంచి ఎదురైతే.. ఎటువంటి జంకు లేకుండానే మాధురి సమాధానం చెప్పడం విశేషం.
*కామెంట్స్ వైరల్
అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో మాధురి కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దువ్వాడ వాణి తో పాటు ఆమె కుమార్తెలు వచ్చి శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన తెలిపిన తర్వాత.. నేరుగా స్పందించారు మాధురి. ఎటువంటి భయం లేకుండా మాట్లాడారు. తనను అనవసరంగా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సైతం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద శిబిరం ఏర్పాటు చేసి ధర్నా చేస్తానని హెచ్చరించారు. అక్కడి నుంచి మీడియాకు మాధురి ప్రధాన వస్తువుగా మారిపోయారు. మాధురి ప్రస్తావన లేకుండానే మీడియాలో కథనాలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
* బాధల నుంచి తేరుకొని..
విపరీతమైన ట్రోల్స్ కు గురైన మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆగి ఉన్న కారును తన కారుతో ఢీకొట్టారు. ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే ఆ ఘటనకు పాల్పడినట్లు చెప్పుకొచ్చారు. రెండు రోజులు పాటు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా తన కుటుంబం మనోవేదనకు గురవుతోందని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇంతలో ఆమె భర్త ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ వాణి చేసిన దుష్ప్రచారంతో తన భర్త రెండేళ్లుగా దూరంగా ఉంటున్నాడని మాధురి ఇదివరకే చెప్పుకొచ్చారు. కానీ అదే భర్త మాధురి అంటే తనకు నమ్మకం ఉందని.. ఆమె చాలా మంచిదని.. తాను భార్యపై అపనమ్మకం వ్యక్తం చేయడానికి రాముడిని కానంటూ పెద్ద పెద్ద మాటలు ఆడారు.
* నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూలు
మరోవైపు మాధురి మాత్రం నాన్ స్టాప్ గా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎన్టీఆర్ మాదిరిగానే దువ్వాడ శ్రీనివాస్ కథ నడిచిందని.. ఆయన యుగ పురుషుడైతే.. శ్రీనివాస్ కూడా యుగపురుషుడేనని తేల్చి చెప్పారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టమని.. అది మీరు పిచ్చి అనుకున్న తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు మాధురి. అంతటితో ఆగకుండాదువ్వాడ శ్రీనివాస్ మంచి కళాకారుడు అని.. సినిమాల్లో అవకాశం ఇస్తే తన అభినయాన్ని ప్రదర్శిస్తారని కూడా మాధురి తేల్చి చెప్పడం విశేషం. మొత్తానికైతే దువ్వాడ ఎపిసోడ్ తెలుగు నాట పెద్ద వినోదాన్ని పంచుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Divvela madhuri made romantic comments saying that she likes duvvada a lot
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com