Prakasam YCP: అధికార వైసిపికి ప్రకాశం జిల్లా తలనొప్పిగా మారిందా? ఆ పార్టీలో రోజురోజుకు విభేదాలు పెరుగుతున్నాయా? వైసిపి నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకొనుందా? రెండు వర్గాలు ఉంటే నష్టం తప్పదని అంచనా వేస్తుందా? అందుకే ఒక వర్గాన్ని వదులుకునేందుకు సిద్ధపడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్రతో ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
గత కొంతకాలంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తి గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా ఆయన తన సెక్యూరిటీనే ప్రభుత్వానికి సరెండర్ చేసి నిరసన తెలిపారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సీఎంకు వెళ్లి మరి ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పరిణామాలను ఏకరువు పెట్టారు.ఆ సమస్య అలా ఉండగానే ఇప్పుడు ఏకంగా విజయసాయిరెడ్డి తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ గా నియమితులైన విజయసాయిరెడ్డి కొద్దిరోజుల క్రితం ప్రకాశం జిల్లా వైసీపీ సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లాకు పెద్దదిక్కుగా ఉండాలని బాలినేనికి సూచించారు. ఇప్పటినుంచి బాలినేనే జిల్లా పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని ప్రకటించారు. అయితే తదనంతర పరిణామాలతో కలవరపాటుకు గురయ్యారు. తనను కార్నర్ చేస్తూ వైసీపీ పెద్దలు ఆడుతున్న రాజకీయాలకు మనస్థాపానికి గురయ్యారు. తన సెక్యూరిటీని సరెండర్ చేసిన తర్వాత.. అగ్రనేతలు సర్ది చెప్పడంతో మెత్తబడ్డారు.
అయితే ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి వైఖరితో బాలినేని అసంతృప్తికి గురయ్యారు. మార్కాపురం సాధికార బస్సు యాత్రకు విజయ సాయి రెడ్డితో కలిసి బాలి నేను వెళ్లారు. ఆయనతోనే రోజంతా గడిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మరోసారి పోటీ చేస్తారని.. ఆయనకు అన్ని విధాల సహకరించాలని పార్టీ శ్రేణులకు విజయసాయిరెడ్డి కోరారు. అయితే తనను కనీస సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించడం ఏమిటని బాలినేని కీనుక వహించారు. మరోసారి అలకపాన్పు ఎక్కారు. ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడం ఏమిటని విజయ్ సాయి రెడ్డిని ప్రశ్నించారు. ఇకనుంచి తాను బయటకు రానని.. ఒంగోలు వరకే పనిచేస్తానని తేల్చి చెప్పారు. దీంతో ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
అయితే వైసిపి హై కమాండ్ సైతం బాలినేని తీరుతో తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. తరచూ పార్టీని రచ్చకెక్కిస్తున్నారని.. ఆయన పార్టీ మారే ఉద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ హై కమాండ్ పెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు సీఎం జగన్ సైతం ఏదో ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తరచూ బాలినేని అసంతృప్తి బాట ఎగురవేయడం భావ్యం కాదని.. ఎన్నికల ముంగిట ఏదో ఇబ్బందికర పరిణామమని అధినాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పార్టీపై పట్టు బిగిస్తున్న తరుణంలో.. బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వదులుకోవడమే మేలని హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చి బాలినేనికి ఒక అవకాశం ఇద్దామని.. అప్పటికి మరోసారి ఈ పరిస్థితి రిపీట్ అయితే నిర్ణయం తీసుకుందామని ఒక డిసైడ్ కొచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే ప్రకాశం జిల్లా వైసిపిలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Disagreements of ycp are raging high command is serious
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com