Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Weather: చలి, ఎండ, వర్షం.. ఏపీలో ఉపద్రవం?!

Andhra Pradesh Weather: చలి, ఎండ, వర్షం.. ఏపీలో ఉపద్రవం?!

Andhra Pradesh Weather: ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణం ఉంది. ఎండల తీవ్రత పెరిగింది. మంచు కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు విపరీతంగా ఉంది. అయితే సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే ఏపీకి చల్లటి కబురు వచ్చింది. వర్ష సూచన ఉంది రాష్ట్రానికి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అయితే దీంతో ఏపీ కంటే తమిళనాడు పై ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవైపు ఎండ.. ఇంకో వైపు మంచు.. మరోవైపు వర్ష సూచనతో విభిన్న వాతావరణం ఉంది రాష్ట్రంలో.

* స్థిరంగా అల్పపీడనం.. బంగాళాఖాతంలో( Bay of Bengal ) అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం నాటికి ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. అటు తర్వాత తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. అయితే దీని ప్రభావం ఏపీ పై ఉన్నదని చెబుతున్నారు. శ్రీలంక తో పాటు తమిళనాడులో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ అల్పపీడనం దిశ మార్చుకుని ఏపీ వైపు వస్తే మాత్రం మనకు వర్షాలు తప్పక పోవచ్చు. అయితే రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

* సాధారణంగా ఉండదు..
సాధారణంగా ఫిబ్రవరి( February) నెలలో బంగాళాఖాతంలో తుఫాన్లు, వాయు గుండాలు, అల్పపీడనాలు ఏర్పడడం చాలా అరుదు. 1891 నుంచి 2024 వరకు కేవలం 7 తుఫాన్లు, వాయుగుండాలి మాత్రమే ఏర్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండేళ్ల కిందట అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మరోసారి అలానే జరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈనెల 19 తర్వాత ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడుతుందని ఒక అంచనా ఉంది. అదే జరిగితే తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

* విపరీతంగా పొగ మంచు..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పొగ మంచు తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా మన్యప్రాంతంలో పొగ మంచు కురుస్తూనే ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మంచుతో విమాన రాకపోకలకు సైతం ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏపీ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ విమానం పొగ మంచు కారణంగా గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈరోజు సైతం ఉత్తర కోస్తా తో పాటు కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు అధికంగా పడింది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సోమవారం కర్నూలులో ఏకంగా 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఒకవైపు చలి, మరోవైపు ఎండ, ఇంకోవైపు వర్ష సూచనతో.. ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version