Homeఆంధ్రప్రదేశ్‌AP Assembly Election Results 2024: చంద్రబాబు అరెస్టే.. జగన్ పతనానికి కారణమైందా?

AP Assembly Election Results 2024: చంద్రబాబు అరెస్టే.. జగన్ పతనానికి కారణమైందా?

AP Assembly Election Results 2024: 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపికి వైసిపి ముచ్చెమటలు పోయించింది.. 2019 ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లతో సరికొత్త విజయాన్ని నమోదు చేసింది. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకార సమయంలో.. “దేశంలోనే బెస్ట్ సీఎం అవుతాను, 30 సంవత్సరాలపాటు నేనే సీఎం అవుతాను, సుపరిపాలన అందిస్తానని” జగన్ వ్యాఖ్యానించారు. కానీ ఆయన వ్యాఖ్యలకు, చేసిన చేతలకు పొంతన లేకుండా పోయిందని ఆరోపణలు వినిపించాయి. ఫలితంగా 2024 లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కనివిని ఎరుగని స్థాయిలో ఓటమిపాలైంది. ఈ స్థాయిలో ఓటమిని జగన్ కూడా ఊహించి ఉండరు. నవరత్నాల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేసి సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ, జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్ అయ్యాయి. దాదాపు జగన్ క్యాబినెట్లో మిత్రులందరికీ ఓడిపోయారు. ఇంతటి ఓటమికి కారణాలేంటి? ఈ స్థాయిలో వైసిపి దారుణమైన పరాభవాన్ని ఎందుకు చవిచూడాల్సి వచ్చింది.. ఒకసారి పరిశీలిస్తే..

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాడు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబునాయుడిని అరెస్టు చేసింది.. అనంతరం ఆయనను రాజమండ్రి జైలులో విచారణ ఖైదీగా పడేసింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. అప్పటినుంచి జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా వైసీపీకి ప్రతిబంధకంగా మారడం. అవి ఈ ఎన్నికల్లో తమకు సానుభూతిగా మారాయని టిడిపి నాయకులు అంటున్నారు..” కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు.. పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహించారు.. ఆయన కోసం ఊరూ వాడా ప్రార్థనలు చేసింది. అవి నేడు ఫలించాయని” టిడిపి నాయకులు అంటున్నారు.

నాడు చంద్రబాబు 52 రోజులపాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన విడుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలోనే టిడిపి, జనసేన కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. నాడే ఆ రెండు పార్టీల మధ్య పొత్తుకు అంకురార్పణ జరిగింది.. ఇక చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించేందుకు నారా లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేశారు. బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి మధ్యవర్తిత్వం నడపడంతో అమిత్ షా స్పందించారు. ఆ తర్వాత చంద్రబాబు విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు మరింత ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి చేసిన ప్రచారం కూటమి గెలుపుకు దోహదం చేసింది. ఫలితంగా కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు కాబోతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular