Dharmana Prasada Rao: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) కీలక ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్నారు. సీనియర్లు బాగానే పనిచేస్తూ ఉంటారు లేకపోతే వెళ్ళిపోవచ్చు అని గట్టిగానే హెచ్చరించినట్టు ఉన్నారు. అందుకే ఇప్పుడు సీనియర్లు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే గతానికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ లోనే ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. అయితే దశాబ్దాల పాటు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులుగా మెలిగారు ధర్మాన, కింజరాపు కుటుంబాలు. కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. వారి మధ్య మంచి అవగాహన ఉంటుందని.. పరస్పర రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీటవేస్తారని దువ్వాడ శ్రీనివాస్ లాంటి నేతలు తరచు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే దశాబ్దాల పాట రెండు కుటుంబాలే శ్రీకాకుళం జిల్లాలు ఏలడం నిజంగా అనుమానాలు ఉన్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు నేరుగా కింజరాపు కుటుంబం పైనే విమర్శలు చేయడం ప్రారంభించారు.
* నాయుడులు ఓడిపోవాలని.. శ్రీకాకుళం( Srikakulam ) జిల్లాకు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఫలాలు అందించారని చెబుతున్నారు ధర్మాన ప్రసాదరావు. తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల పాటు జిల్లా వాసులు అధికారాన్ని కట్టబెడితే ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదని చెబుతున్నారు. కింజరాపు కుటుంబమే అనేక ఏళ్ల పాటు అధికారంలో ఉందని గుర్తు చేస్తున్నారు ధర్మాన. జిల్లాకు ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా అని నిలదీస్తున్నారు. మూలపేట పోర్టును 70 శాతం పూర్తి చేసిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని.. మిగిలిన 30 శాతం పనులు కూడా చేయించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టిడిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆ నాయుడు.. ఈ నాయుడు మాజీలు కావాలని హాట్ కామెంట్స్ చేశారు.
* జగన్ హెచ్చరికలతోనే..
అయితే ధర్మాన వైఖరిలో మార్పు రావడం వెనుక జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా రోజులపాటు బయటకు రాలేకపోయారు ధర్మాన ప్రసాదరావు. ఒకానొక దశలో ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. కానీ ఆయనకు ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే తిరిగి వైసీపీలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే ధర్మాన బ్రదర్స్ కింజరాపు వారితో లోపాయికారీ ఒప్పందాలతో ముందుకు సాగుతుంటారని దువ్వాడ శ్రీనివాస్ నేతలు బాహటంగానే వ్యాఖ్యానిస్తుంటారు. పలుమార్లు జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కూడా. శ్రీకాకుళం జిల్లా పరిస్థితి జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ధర్మాన ప్రసాదరావు కు తేల్చి చెప్పారట కింజరాపు ఫ్యామిలీని టార్గెట్ చేసుకోవాల్సిందేనని. అందుకే ఇప్పుడు పోర్టుల సందర్శన.. ప్రాజెక్టుల సందర్శన అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే కింజరాపు ఫ్యామిలీ పై ధర్మాన విమర్శలను ఎవరు నమ్మలేకపోతున్నారు. అయితే అది బలవంతంగా చెప్పిస్తున్నవా? మనసులోతులనుంచి వస్తున్నవా? అన్నది తెలియాల్సి ఉంది
