Homeఆంధ్రప్రదేశ్‌DGP Dwaraka Tirumala Rao: రాజకీయ ఒత్తిళ్లతో మేము పనిచేయము.. పవన్ కు షాకిచ్చిన ఏపీ...

DGP Dwaraka Tirumala Rao: రాజకీయ ఒత్తిళ్లతో మేము పనిచేయము.. పవన్ కు షాకిచ్చిన ఏపీ డీజీపీ

DGP Dwaraka Tirumala Rao: ఏపీలో శాంతిభద్రతల పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన పవన్ ఆ శాఖను తీసుకుంటానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నీరు గారి పోయిందని ఆరోపించిన సంగతి విధితమే. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు పవన్. గత వైసిపి హయాంలో సీఎం చంద్రబాబుతో పాటు తనపై పోలీసు వ్యవస్థతో ఆడుకున్నారని గుర్తు చేశారు. అయితే దీనిపై హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పవన్ సూచనలను తప్పకుండా తీసుకుంటామని.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో వైసీపీ కూడా స్పందించింది. కూటమిలో విభేదాలు ప్రారంభమయ్యాయని చెబుతోంది. అందుకే హోం శాఖపై పవన్ పడ్డారని ఎద్దేవా చేసింది. తాజాగా పవన్ కామెంట్స్ పై రాష్ట్ర డిజిపి ద్వారకాతిరుమల స్పందించారు. పోలీస్ శాఖ రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటుందని.. ప్రజాస్వామ్యంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా కొన్ని తప్పులు జరిగాయని.. దానికి ఒప్పుకుంటున్నామని కూడా చెప్పారు. అప్పట్లో జరిగిన తప్పులు సరిదిద్దడం పై దృష్టి పెట్టామని కూడా వివరించారు. అనంతపురం పర్యటనలో ఉన్న డీజీపీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించడం విశేషం.

* రాజకీయ ఒత్తిళ్లతోనే
రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీస్ శాఖ సక్రమంగా పనిచేయలేక పోతుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. కాగా పవన్ ఇదే మాదిరిగా వ్యవహరించారు. మావాడు, మా కులం వాడు, మా రక్తం వాడు అంటూ నిందితుడిని కొమ్ముకాసే వ్యవస్థ ఉన్నంతవరకు నిందితులు రెచ్చిపోతుంటారని పవన్ గుర్తు చేశారు. బిజెపి పవన్ అభిప్రాయంతో ఏకీభవించారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ లు సరిగ్గా విధులు నిర్వహించిన విషయాన్ని కూడా ఒప్పుకున్నారు. ఓ పార్టీ కార్యాలయం పై దాడి జరిగితే బాధ్యతగా వ్యవహరించలేదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల దాడి జరిగిందని అప్పట్లో పోలీసులు కేసును నీరుగార్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు డిజిపి.

* పనితీరుపై చర్చ ప్రారంభం
అయితే పవన్ ఏపీలో శాంతిభద్రతలపై మాట్లాడిన తర్వాతే పోలీస్ వ్యవస్థ పనితీరుపై చర్చ ప్రారంభం అయ్యింది. అయితే పవన్ వైసీపీ హయాం నుంచే పోలీసు వ్యవస్థ నీరు గారి పోయిందన్న విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. అప్పట్లోనే నేరాలనియంత్రణకు చర్యలు చేపట్టలేదని.. మితిమీరిన రాజకీయ జోక్యంతోనే పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయలేకపోయిందని పవన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే విషయాన్ని డీజీపీ ప్రస్తావించారు. అయితే రాజకీయ ఒత్తిళ్లు లేకపోతే స్వేచ్ఛగా పనిచేస్తామని డిజిపి ప్రకటించడం విశేషం.రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో కఠిన చర్యలకు దిగుతామని డిజిపి స్పష్టం చేశారు. మొత్తానికైతే పవన్ హెచ్చరికల తర్వాత హోంశాఖ తో పాటు పోలీస్ వ్యవస్థ అప్రమత్తం కావడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular