Delhi Capitals 2025: ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయింది. గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ గా ఉన్నప్పుడు.. ఆ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్, కెవిన్ పీటర్సన్, డేవిడ్ వార్నర్ అటువంటి ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. కానీ ఢిల్లీ జట్టు ఐపీల్ ట్రోఫీలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఆ జట్టును ప్రేమించే వాళ్ళు తప్ప.. ద్వేషించే వాళ్ళు లేరు. ఇక ప్రస్తుత సీజన్లో ఢిల్లీ జట్టు బలంగా కనిపిస్తోంది. అక్షర్ పటేల్ నాయకత్వంలో ఢిల్లీ జట్టు వరుస విజయాలు సాధిస్తూ ఐపీఎల్ 18వ ఎడిషన్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఢిల్లీ జట్టు ఓడిపోలేదు. ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ విజయం సాధించింది. ఢిల్లీ జట్టుకు అటాకింగ్ బ్రాండ్ క్రికెట్ ఆడుతుంది అనే పేరు ఉంది. అందువల్లే ఆ జట్టు ఐపీఎల్ అభిమానులకు అత్యంత ఇష్టమైనదిగా మారిపోయింది. ఇక ఈ జట్టులో ద్వేషించడానికి.. వంక పెట్టడానికి అంటూ ఏమీ లేదు.
Also Read: గెలికిన కోహ్లీకి.. గెలిపించి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాహుల్.. వీడియో
తెలుగు వారితో మమకారం
యాదృచ్ఛికంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన రెండవ సొంతమైదానంగా విశాఖపట్ట్టణాన్ని ఎంచుకుంది. తద్వారా తెలుగుభారితో కూడా బంధాన్ని ఏర్పరచుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న జిఎంఆర్ గ్రూప్.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం ప్రాంతం నుంచి ఏర్పడిందే. జిఎంఆర్ గ్రూప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు యజమానిగా ఉండడం వల్ల.. విశాఖ నగరాన్ని రెండవ మైదానంగా ఎంపిక చేసుకుంది. ఢిల్లీ జట్టులో ఫాఫ్ డూ ప్లెసిస్, ఫ్రేజర్ మెక్ గూర్క్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ వంటి భీకరమైన బ్యాటర్లు ఉన్నారు. స్టార్క్, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ వంటి బౌలర్లు కూడా ఉన్నారు. ఇక ఢిల్లీ జట్టు ఇదే జోరు గనుక వచ్చే మ్యాచ్లలో కొనసాగిస్తే దర్జాగా ప్లే ఆఫ్ వెళ్తుంది. అంతేకాదు ప్లే ఆఫ్ లోనూ స్థిరమైన ఆట తీరు కొనసాగిస్తే ఖచ్చితంగా ఫైనల్ దాకా ప్రయాణం సాగిస్తుంది. ఫైనల్ లో అద్భుతాలు చేస్తే విజేతగా నిలుస్తుంది. గడచిన 18 సంవత్సరాలుగా ఢిల్లీ జట్టు ఐపిఎల్ ట్రాఫిక్ కోసం కళ్లు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తోంది. వీరేంద్ర సెహ్వాగ్, డేవిడ్ వార్నర్, కెవిన్ పీటర్సన్ కంటే ప్రస్తుతం అక్షర్ పటేల్ ఆధ్వర్యంలో ఢిల్లీ జట్టు అద్భుతమైన విజయాలు సాధిస్తోంది. గతానికంటే భిన్నంగా ఆడుతోంది. అందువల్లే ఈసారి ఢిల్లీ జట్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి.. జీరో హేటర్స్ వల్ల ఢిల్లీ జట్టుకు అన్ని మంచి శకునములే ఉన్నాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ జట్టు ఛాంపియన్ గా ఆవిర్భవిస్తుందని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.