Constituency Delimitation In India: ఇది ఎప్పటినుంచో నానుతూ ఉన్న అంశం. ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంలో.. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నియోజకవర్గం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశావాహులు చాలామంది తమ రాజకీయ భవిష్యత్తు మీద భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ అంచనాల మీద కేంద్రం నీళ్లు చల్లినట్టే కనిపిస్తోంది.
Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?
నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ఓకే చెప్పినప్పటికీ.. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే సెగ్మెంట్లు పెద్దగా పెరిగే అవకాశం లేదు. దీనికి తోడు సెగ్మెంట్లను 50 శాతం వరకే పెంచుతారు.. అంతేకాదు మహిళలకు 33% రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తారు. ఈ పార్లమెంట్ సెషన్ లోనే ఈ బిల్లు ప్రవేశపెడతారని తెలుస్తోంది.
పునర్విభజన వల్ల పార్లమెంట్ సీట్లు 816 కు చేరుకుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే సీట్లు 262 నుంచి 263 వరకు పెరుగుతాయి. పార్లమెంటు స్థానాలు 37 నుంచి 38 కి.. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు 178 నుంచి 179 కి.. పార్లమెంటు స్థానాలు 25 నుంచి 26 వరకు పెరుగుతాయి.
కేంద్ర ప్రభుత్వం 2011 కాకుండా.. ప్రస్తుతం పెరిగిన జనాభా ప్రకారం తీసుకుంటే శాసనసభ, పార్లమెంట్ స్థానాలు కచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే విషయంపై అనేక సందర్భాలలో మాట్లాడారు. ఎమ్మెల్యే కావాలని.. ఎంపీగా గెలవాలని చాలామందికి ఉందని.. అయితే అందరికీ అవకాశాలు ఇవ్వలేకపోతున్నామని ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్యే స్థానాలను.. ఎంపి స్థానాలను పెంచే అవకాశం ఉందని.. అదే జరిగితే చాలామందికి అవకాశాలు కల్పించవచ్చని చెప్పారు. అయితే కేంద్రం ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. 2011 జనాభా లెక్కలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడంతో ఆశావహులు అంచనా వేసుకున్న స్థాయిలో స్థానాలు పెరిగే అవకాశం లేదు..
తెలంగాణ రాష్ట్రంలో ఒక అసెంబ్లీ.. ఒక పార్లమెంటు స్థానం మాత్రమే పెరుగుతాయి. సెగ్మెంట్లను 50 శాతం వరకు పెంచుతామని కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఆ శాతాన్ని 60 వరకు చేర్చితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానివల్ల పరిపాలన మెరుగుపడుతుందని.. నియోజకవర్గాల విస్తృతి పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొదటినుంచి కూడా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఎమ్మెల్యే స్థానాలు పెరగాలని.. పార్లమెంటు స్థానాలు కూడా విస్తృతం కావాలని కోరుకుంటున్నారు. అయితే వారి కోరికకు తగ్గట్టుగా స్థానాలు పెరిగే అవకాశం లేకపోవడంతో నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తే.. మిగతా నాయకులకు నామినేటెడ్ లేదా ఇతర పోస్టులను కల్పించే అవకాశం ఉంది. కాగా, కేంద్ర నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816 కు చేరుకుంటాయి. అసెంబ్లీ స్థానాలు 4123 నుంచి 6185 వరకు పెరుగుతాయి.
