https://oktelugu.com/

Ram Gopal Varma: వదిలేదేలే.. రాంగోపాల్ వర్మను వెంటాడుతున్న కూటమి సర్కార్.. ఏకంగా హైదరాబాద్ వెళ్లి మరీ..

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఆయన పెట్టిన పోస్టులు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే గతంలో చంద్రబాబుతో పాటు పవన్ పై ఆయన పెట్టిన పోస్టులు ఇప్పుడు పోలీస్ కేసులకు కారణమవుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : November 13, 2024 6:09 pm
    Ram Gopal Varma

    Ram Gopal Varma

    Follow us on

    Ram Gopal Varma: తెలుగు చిత్ర పరిశ్రమలు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కానీ ఇటీవల ఆయన వైఖరి వివాదాస్పదంగా మారింది. గత ఐదేళ్లుగా వైసీపీకి అనుకూలంగా, టిడిపి జనసేన లకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు ఆర్జీవి. వ్యతిరేక సినిమాలు తీయడమే కాదు సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసేవారు.గతంలో చాలా సందర్భాల్లో ఆయన వైఖరి వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు.మెగా కుటుంబం పై సైతం తనదైన శైలిలో కామెంట్స్ చేసేవారు. మధ్య మధ్యలో అశ్లీలత తావిచ్చేలా కొన్ని వీడియోలు సైతం పోస్ట్ చేసేవారు. అయితే అప్పట్లో వైసీపీకి మద్దతు దారుగా ఉండడం.. వైసిపి అధికారంలో ఉండడంతో రాంగోపాల్ వర్మపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. అయితే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రీ రెడ్డి వంటి వారిపై సైతం కేసులు నమోదవుతున్నాయి. గతంలో వారు చేసిన కామెంట్స్ తో పాటు సోషల్ మీడియా పోస్టులపై ఇప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదుల మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు పోలీసులు నోటీసులు అందించారు.

    * నిన్ననే ఫిర్యాదు
    నిన్ననే రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, పవన్, లోకేష్ లపై రాంగోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడుకు చెందిన టిడిపి నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈరోజు రాంగోపాల్ వర్మ కు నోటీసులు అందించారు. మద్దిపాడు పోలీసులు హైదరాబాదులోని రాంగోపాల్ వర్మ నివాసానికి వెళ్లి ఈ నోటీసులు అందజేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులపై కేసులు నమోదైన తరుణంలో.. ఆర్జీవికి ఏకంగా నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    * మహిళల జోలికి వస్తే సహించేది లేదు
    మహిళల జోలికి వస్తే సహించేది లేదని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసిపి నేతల కుటుంబాల జోలికి వెళ్లిన వారిని సైతం విడిచిపెట్టబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తద్వారా సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. రాంగోపాల్ వర్మ విషయంలో ఇప్పటికే ప్రజల్లో భిన్నమైన అభిప్రాయం ఉంది. భావవ్యక్తీకరణ పేరిట ఆయన పెట్టే పోస్టులు అభ్యంతరకరంగా ఉండేవి. ఇప్పుడు కూటమి సర్కార్ ఈ అంశంపై సీరియస్ గా ఉండడంతో ఆర్జీవి పై కేసు నమోదు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా నోటీస్ అందుకోవడంతో ఆర్జీవి ఎలా వ్యవహరిస్తారో చూడాలి.