CM Revanth Reddy: అమరావతి నిర్మాణం పై చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. 2014లో ఏపీ రాజధాని నిర్మాణానికి అంకురార్పణ చేసిన ఆయన.. 2019 వరకు ఫౌండేషన్ పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జంగిల్ కటింగ్ పూర్తి చేశారు. ఇతర నిర్మాణాల పనులు వేగవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కీలకంగా ఉండడంతో అమరావతి నిర్మాణానికి భారీగానే నిధులు మంజూరయ్యాయి. ఆ నిధుల ద్వారా పనులను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
అమరావతి నిర్మాణ విషయంలో వైసిపి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ఇటీవల వైసీపీ తన అనుకూల మీడియా, సోషల్ మీడియాలో అమరావతి నిర్మాణం పై రకరకాల వీడియోలను తెరపైకి తెచ్చింది. అమరావతిలో విపరీతంగా నీళ్లు వచ్చాయని.. భవనాలు నిర్మించే ప్రాంతంలో నీళ్లు ఇలా ఉంటే భవిష్యత్తులో భవనాలు ఎలా ఉంటాయని వైసీపీ ఆరోపిస్తోంది.. సాధారణంగా ఏపీలో వైసిపి, టిడిపి మధ్య నిత్యం విమర్శలు సాగుతూనే ఉంటాయి. ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే తొలిసారిగా ఏపీ పై రేవంత్ రెడ్డి మాట్లాడారు. అది కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రఖ్యాత ఇండియా టుడే నిర్వహించిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి గురించి చర్చ వచ్చినప్పుడు రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు..” నాకు తెలంగాణ అనేది బిగ్గెస్ట్ అసెట్. అందులో హైదరాబాద్ అనేది మరింత అడ్వాంటేజ్. అమరావతి అనేది టిడిపికి పెద్ద గుద్దిబండ. రాజకీయంగా లోకేష్ చాలా చిన్నవాడు. చంద్రబాబు చాలా సీనియర్. నేను మిడిల్ ఏజ్ లో ఉన్నా. ఇంకా చాలా సంవత్సరాల పాటు రాజకీయాలు చేయగలను. రాజకీయాలు చేసే ఓర్పు నేర్పు నాలో చాలా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నాకు సానుకూల అంశాలు. వీటి ఆధారంగానే నేను ముందుకు వెళ్తాను. పైగా నాకు బలమైన కార్యవర్గం ఉంది. వారంతా నాకు ఎప్పటికీ వెన్ను దన్నుగా నిలుస్తూనే ఉంటారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికి చాలా ప్రణాళికలు నా వద్ద ఉన్నాయి. వాటన్నిటిని దశలవారీగా అమలు చేస్తాను. ఉన్నంతవరకు బెటర్ పాలిటిక్స్ చేసి.. నాకంటూ ఒక హిస్టరీ క్రియేట్ చేసుకుంటానని” తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో తమకు అనుకూలమైన బిట్ లను కట్ చేసి అమరావతి మీద రేవంత్ నోరు పారేసుకున్నారని.. జాతీయ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు ఇంటర్వ్యూ మొత్తం టెలికాస్ట్ చేస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ సందర్భంలో ఆ మాటలు మాట్లాడారో తెలుస్తుందని కౌంటర్ ఇస్తున్నారు.
జాతీయ మీడియాలో అమరావతి మీద, టీడీపీ మీద నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నాకు అడ్వాంటేజ్ అయితే అమరావతి వారికి పెద్ద గుదిబండ
చంద్రబాబు వయస్సు మీరిపోయాడు.. అది తెలుగుదేశం పార్టీకి చాలా నెగెటివ్. లోకేశ్ ఇంకా చిన్న పిల్లవాడు
Video Credits – India Today pic.twitter.com/1zNN8L13PF
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2025