CM Jagan : రైతుల కోసం పబ్లిసీటి కి దూరంగా జగన్ చేస్తున్న పని ఇదే

క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అకాల వర్షాలతో నష్టం జరిగిన జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా సీనియర్ ఐఏఎస్ లను నియమించారు.

Written By: Dharma, Updated On : May 7, 2023 4:42 pm
Follow us on

CM Jagan : అకాల వర్షాలతో రాష్ట్రం అతలాకుతలంగా మారింది. ఖరీఫ్ లో భాగంగా వేసిన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పందించింది జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. నష్టపోయిన ప్రతీ రైతుకు న్యాయం చేయాలని ఆదేశించారు. అకాల వర్షంతో గోదావరి జిల్లాలతో పాటు కోస్తాల పంటలకు అపార నష్టం కలిగింది. దీనిపై ఉన్నత స్థాయి రివ్యూ చేసిన సీఎం జగన్ ఆయా జిల్లాల కలెక్టర్లకు, అధికారులు కీలక ఆదేశాలిచ్చారు.

తడిసిన , రంగుమారిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టోపోయిన రైతుల వివరాలను గ్రామ సచివాలయాల్లో ఉంచి తనిఖీ చేస్తున్నారు. సాయం అందని రైతులు ఉంటే నేరుగా సచివాలయానికి సంప్రదిస్తే నమోదు చేస్తున్నారు. మొత్తం రబీతో పాటు రంగు మారిన ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులను అధిగమించేందుకు ట్రోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అకాల వర్షాలతో నష్టం జరిగిన జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా సీనియర్ ఐఏఎస్ లను నియమించారు.

అటు తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయడం ప్రారంభించింది. రైతుల వద్ద ఉన్న రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్దకాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ప్రభుత్వ భవనాల్లోకి తరలిస్తున్నారు. ధాన్యం తరలింపు కోసం రవాణా ఖర్చుల కింద కలెక్టర్ కు కోటి రూపాయలు చొప్పున కేటాయించారు. ఆ నిధులతో ఇప్పుడు తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు. మొత్తానికైతే అకాల వర్షాలతో పంటలకు నష్టం జరిగిన అన్ని జిల్లాలో సహాయ చర్యలు, రంగుమారిన ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మొక్క జొన్న రైతులను ఆదుకుందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపారు. 66 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొక్క జొన్న ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లోని 3,330 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే 5,036 మంది రైతులు సీఎం యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.