CM Chandrababu Singapore Visit: ఏపీకి( Andhra Pradesh) పెట్టుబడులే లక్ష్యంగా రేపు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్ళనున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ లతోపాటు అధికారులు సైతం సింగపూర్ వెళ్ళనున్నారు. ఈనెల 31 వరకు అంటే ఆరు రోజులపాటు వీరి పర్యటన కొనసాగనుంది. సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ పరిశ్రమల సీఈవోలు, ప్రతినిధులతో ఈ బృందం భేటీ కానుంది. తొలిరోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంద్రుల సంఘం నిర్వహించే తెలుగు ‘డయాస్పోరా’ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడుల పె ట్టాలని ఎన్నారై లను ఆహ్వానించునున్నారు. పేదరిక నిర్మూలనకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పి 4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కూడా చంద్రబాబు పిలుపునివ్వనున్నారు. ఒకవైపు పెట్టుబడులు, మరోవైపు పి4 సాధన ధ్యేయంగా చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన కొనసాగనుంది.
Also Read: ఏపీలో లక్ష కొత్త పింఛన్లు.. ఎవరికి దక్కుతాయంటే?
తొలిసారిగా దావోస్ కు
కూటమి ప్రభుత్వం( Alliance government ) ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లారు సీఎం చంద్రబాబు. ఏటా అక్కడ ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చి కొద్ది నెలలే అయినా.. దావోస్ వెళ్లారు చంద్రబాబు. ఆయన వెంట మంత్రుల బృందం కూడా వెళ్ళింది. దావోస్ పర్యటనలో కీలక ఒప్పందాలు జరుగుతాయని భావించారు. కానీ ప్రాథమికంగా చర్చలకే పరిమితమయ్యారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. కానీ వరుసగా ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు వస్తుండడం వెనుక దావోస్ పెట్టుబడుల సదస్సు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళుతుండడం విశేషం. ఇప్పుడు అందరి దృష్టి అటువైపే ఉంది.
Also Read: స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఔట్.. ప్రక్షాళన దిశగా చంద్రబాబు!
బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో..
గత అనుభవాల దృష్ట్యా బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో( brand AP promotion ) రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు సీఎం చంద్రబాబు ఈ పర్యటనను వేదికగా చేసుకొనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను సీఎం ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, సువిశాల తీర ప్రాంతం, ఏపీలో మానవ వనరుల గురించి వారికి వివరించనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెడితే ఆమోదయోగ్యంగా ఉంటుందని.. రాయితీలు కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది.
పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం..
సీఎం చంద్రబాబు( CM Chandrababu) నేతృత్వంలోని ఈ బృందం ఆరు రోజులపాటు సింగపూర్ లో ఉండనుంది. వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో చర్చలు జరపనుంది. ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫింటెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అక్కడ నిర్వహించే బిజినెస్ రోడ్డు షోకు కూడా హాజరవుతారు. 27న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ వద్ద ప్రభాస్ ఆంధ్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మొత్తానికైతే చంద్రబాబు బృందం ఆరు రోజులపాటు సింగపూర్లో బిజీబిజీగా గడపనుందన్నమాట.