Chandrababu Advises Farmers: వ్యవసాయానికి భారత దేశం పెట్టింది పేరు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు వివిధ రకాల పంటల సాగుకు అనుకూలం. అందుకే వ్యవసాయంపైనే మెజారిటీగా ప్రజలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మారుతున్న పరిస్థితులతో వ్యవసాయంలోనూ మార్పులు వస్తున్నాయి. అయితే ఆహార పంటల సాగు తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అన్నపూర్ణగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యవసాయంలో కొత్త పంటలు సాగుపై సీఎం చంద్రబాబునాయుడు తాజాగా రైతులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు ప్రస్తుతం ఏం తింటున్నారో దానిపై ఆధారపడి పంటలు పండించాలని సూచించారు. నీరు ఉంది కాబట్టి వరి వేస్తే ప్రయోజనం ఉండదు, దాన్ని తినేవాళ్లు లేరు అని స్పష్టం చేశారు. సీఎం సూచనలు వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనకు దారితీస్తోంది. డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాధులు పెరగడంతో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్న నేపథ్యంలో పంట ప్రణాళికను సమీక్షించాల్సిన అవసరముందని ఆయన సూచించారు.
మార్కెట్ మార్పులు కీలకం..
ఆధునిక సమాజంలో ఆరోగ్యం ప్రధాన లక్ష్యంగా మారడంతో తెల్ల బియ్యంకు బదులుగా మిల్లెట్లు, పంచదార రహిత ధాన్యాలు, నెయ్యి అధికంగా ఉండే పంటల వినియోగం పెరుగుతోంది. ఈ ప్పరినామాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు మార్కెట్ అవసరాలకనుగుణంగా ఉత్పత్తి మార్పులు చేసుకోవాలని సీఎం అభిప్రాయపడ్డారు.
సంస్కరణలు అవసరం..
చంద్రబాబు వ్యాఖ్య రైతులపై ఉన్న సంస్కరణల దృష్టిని చూపిస్తుంది. పాతపద్దతులపై ఆధారపడితే లాభాలు కష్టమని, సాగు విధానాలను మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా చేయడం ద్వారానే వ్యవసాయం లాభదాయకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి దృష్టికోణం రైతులకు ఆర్థిక పరంగా కొత్త అవకాశాలను తెరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పంట వైవిధ్యం కావాలి..
ఒకే పంటపై ఆధారపడే పద్ధతిని వీడి, విభిన్న పంటల సాగుతో నేల ఉపాధి, నీటి వినియోగం, మార్కెట్ స్థిరత్వం మెరుగుపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి మార్పులను ప్రోత్సహించే విధానాలు తీసుకురావాలన్న అభిప్రాయం రైతు వర్గాలదే.
నీళ్ళు ఉన్నాయని ఊరికే వరి పండిస్తే తినేవాళ్ళు లేరు.
ఎందుకంటే అందరికీ డయాబెటిక్ వచ్చింది.. ప్రజలు ఏమి తింటారో, మనం అవే పండించాలి – సీఎం చంద్రబాబు pic.twitter.com/DGuiL2CZoH
— Anitha Reddy (@Anithareddyatp) November 13, 2025