Chandrababu And Pawan Kalyan: ఏపీ( Andhra Pradesh) ప్రభుత్వ పెద్దల మధ్య చక్కటి సమన్వయం ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య చక్కటి బంధం కొనసాగుతోంది. నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్లు గా నియమితులైన వారికి నియామక పత్రాలు అందించారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అభ్యర్థులతో ప్రమాణం చేయించి నియామక పత్రాలను అందజేశారు. కానిస్టేబుళ్లు గా నియమితులైన అభ్యర్థులు భావోద్వేగంతో మాట్లాడారు. తమ మనసులో ఉన్న బాధను వ్యక్తం చేశారు. మహిళా అభ్యర్థుల సైతం తమ ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలను వివరించారు.. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన బాలరాజు అనే కానిస్టేబుల్ అభ్యర్థి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఒక విజ్ఞప్తి చేశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అయితే దీనిపై చంద్రబాబు స్పందించడం విశేషం.
* నియామక పత్రాల అందజేత..
రాష్ట్రవ్యాప్తంగా 6100 కానిస్టేబుల్ పోస్టుల( constable posts ) భర్తీ ప్రక్రియ ఇటీవల పూర్తయింది. ఆగస్టులో ఫలితాలు వెల్లడించారు. అన్ని రకాల ప్రక్రియలు ముగించి అమరావతిలో ఒకే వేదికపై నియామక పత్రాలు అందించారు. ఎంపికైన వారికి ఈనెల 22 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. 9 నెలల పాటు ఈ శిక్షణ ఉంటుంది. సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ, ఆర్ముడు రిజర్వు కానిస్టేబుళ్లకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయ్యాక పోస్టింగ్ ఇస్తారు. వాస్తవానికి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రకటించారు. కానీ భర్తీ చేయడంలో మాత్రం జాప్యం చేశారు. కేవలం ప్రాథమిక పరీక్ష నిర్వహించి వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఇబ్బందులను అధిగమించి కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పూర్తి చేయగలిగింది.
* బాలరాజు అనే యువకుడి విన్నపం మేరకు..
అమరావతిలో( Amravati capital ) రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కానిస్టేబుల్ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో కోలాహలం నెలకొంది. మరోవైపు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులను వేదికపై మాట్లాడే అవకాశం కల్పించారు. ఆ సమయంలో అల్లూరి జిల్లాకు చెందిన బాలరాజు అనే అభ్యర్థి తమ గ్రామానికి రహదారి సదుపాయం లేదని.. రోడ్డు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తికి స్పందించిన సీఎం చంద్రబాబు రోడ్డు నిర్మాణానికి రూ.3.9 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం పై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ విషయంలో సాయం అడిగిందే తడువుగా ముందుకొచ్చి అందిస్తున్నారు. సొంతంగానే సాయం అందజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని నమ్మకం ప్రజల్లో ఏర్పడింది.