CJI NV Ramana- Jagan: వాళ్లిద్దరూ ప్రత్యర్థులు.. ఒకరు దేశ న్యాయస్థానపు పెద్ద అయితే.. మరొకరు ఏపీకి సీఎం.. ఇద్దరికీ పడదు. జస్టిస్ ఎన్వీ రమణ మీద గతంలో జగన్ ఏకంగా అప్పటికి సీజేఐకి లేఖ రాసి సంచలనం సృష్టించారు. తన ప్రభుత్వాన్ని చంద్రబాబుతో కలిసి అస్తిరపరుస్తున్నాడని ఆరోపించారు. అలాంటి జగన్ ఇప్పుడు పాత పగలన్నీ మరిచిపోయి అదే సీజేఐ రమణతో కలిసిపోయారు. లోపల ఎంత విద్వేశాలున్నా పైకి మాత్రం నవ్వు మోముతో విందులో పాల్గొన్నారు. సీజేఐ రిటైర్ మెంట్ కనిపించిన ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేడు ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన కోర్టు భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో కలిసి ప్రారంభించనున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో కోర్టు భవనాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇప్పుడు సుప్రీం కోర్టు సీజేగా ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నారు. విశేషమేమిటంటే ఇదే కోర్టు నుంచే ఆయన తన న్యాయవాద వృత్తిని సైతం ప్రారంభించడం విశేషం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే కార్యక్రమం అనంతరం ప్రధాన న్యాయమూరి్త ఎన్వీ రమణ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చేరుకుంటారు. విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు.ఆయనకు అక్కడ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరుకానున్నారు. తాను చదువుకున్న యూనివర్సిటీ నుంచి ఎన్వీ రమణ గౌరవ డాక్టరేట్ పొందనున్నారు. కాగా కార్యక్రమాన్ని నాగార్జున యూనివర్సటీ ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఏర్పాట్లను ఘనంగా చేసింది.

సీఎం విందు..
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఏపీ పర్యటనకు వచ్చిన ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటుచేసింది. సీఎం జగన్ విందును నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు హాజరుకానున్నారు. సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తరువాత విజయవాడకు వచ్చిన ఎన్వీ రమణను సీఎం జగన్ అప్పట్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆత్మీయ సమావేశం సైతం ఏర్పాటుచేశారు. ఇప్పుడు విందు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి సుప్రిం కోర్టు సీజేఐ హోదాలో వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.
Also Read: CM Jagan- Welfare Schemes: జగన్ అంతే.. ప్రకటనలతోనే పాలన

అప్పట్లో అడ్డకున్నారని ప్రచారం..
అయితే గత అనుభవాలను నెమరువేసుకుంటే మాత్రం అందరూ ఆశ్చర్యపడాల్సిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు సీఎం జగన్ అడ్డంకులు సృష్టించిన సందర్భాలున్నాయి. ఆయన నియామకం వద్దంటూ జగన్ రాసిన లేఖ అప్పట్లో కలకలం సృష్టించినట్టు వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో ఆయనపై కులముద్ర వేశారన్న ప్రచారం నడిచింది. తెలుగుదేశం పార్టీకి ఆయన సేవలందించారని గుర్తుచేస్తూ ఎన్వీరమణను సీజేఐ కాకుండా జగన్ శతవిధాలా ప్రయత్నాలు చేశారన్న టాక్ నడిచింది. అయినా అత్యున్నత న్యాయస్థానంపై ఎన్వీ రమణ కూర్చోగలిగారు. తదనంతర పరిణామాలోవారిద్దరు కలిసింది ఒకటి రెండు సార్లే. అది అధికారిక కార్యక్రమాల్లోనే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే విందు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గామారింది. లోపల ఎంత పగలున్నా పైకి ‘విందు’.. తప్పదు మరీ.
Also Read:Honey Badger : ప్రపంచంలోనే భయం లేని జంతువు.. ఛత్తీస్గఢ్లో ప్రత్యక్షం.. వీడియో వైరల్
[…] […]