Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మీద ప్రేమను చాటుకున్న చిరంజీవి, అల్లు అర్జున్

Pawan Kalyan రాజకీయ దురంధరులైన మీపై, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ పైన జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ రాజధాని లేని, గాయ పడిన రాష్ట్రాన్ని గాడిన పెట్టి నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు...

Written By: Gopi, Updated On : June 4, 2024 9:56 pm

Chiranjeevi and Allu Arjun who expressed their love for Pawan Kalyan

Follow us on

Pawan Kalyan : జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీ తో విజయం సాధించాడు. ఇక ఈ విజయాన్ని పురస్కరించుకొని చాలామంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గెలుపుని ప్రశంసిస్తూ మీరు ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశ్యం తోనే పాలిటిక్స్ లోకి వచ్చారు. గెలిచి మీ సత్తా ఏంటో చాటుకున్నారు అలాగే మీరు మీ నియోజకవర్గ ప్రజలకు మంచి చేసి మంచి లీడర్ గా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేయడం పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతోషన్నిస్తుంది.

ఇక పవన్ కళ్యాణ్ గెలుపును ఉద్దేశిస్తూ చిరంజీవి కూడా ఒక ట్వీట్ చేశాడు “ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో నీకు బాగా తెలుసు… నువ్వు తగ్గావని కొంతమంది అనుకున్నప్పటికీ, అది ప్రజలను నెగ్గించడానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా నాకు చాలా గర్వంగా ఉంది… నువ్వు గేమ్ చేంజర్ వి మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వి కూడా అని ప్రతి ఒక్కరు నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది. నీ కృషి, నీ ధ్యేయం, నీ సత్యం అన్ని జనం కోసమే..

ఇక ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, నీ కలల్ని నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని నిజం చేసే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు.. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను”… అంటూ చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి పోస్ట్ పెట్టడం అనేది నిజంగా మెగా అభిమానుల్లో సందడి వాతావరణాన్ని నిలకోల్పింది. ఇక అలాగే చిరంజీవి చంద్రబాబు నాయుడు ను ఉద్దేశిస్తూ కూడా ఒక ట్వీట్ చేశాడు…

“ప్రియమైన చంద్రబాబునాయుడు గారికి చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు శుభాకాంక్షలు మీ నాయకత్వ పటిమకు, మీ పోరాట తత్వానికి రాష్ట్రానికి గత పూర్వ వైభవం తేగలిగిన మీకు ఈ విజయం అనేది ఒక నిదర్శనం…రాజకీయ దురంధరులైన మీపై, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ పైన జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ రాజధాని లేని, గాయ పడిన రాష్ట్రాన్ని గాడిన పెట్టి నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు…