Nandigama: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు వారి ఆర్థిక స్తోమత ఆధారంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. మనదేశంలో ప్రాంతాలను బట్టి.. కూడా నవరాత్రి వేడుకలు జరుగుతుంటాయి. ఉత్తరాది రాష్ట్రాలలో వేడుకలు ఒక రకంగా.. దక్షిణాది రాష్ట్రాలలో మరొక రకంగా జరుగుతూ ఉంటాయి.. ఎక్కడ వేడుకలు జరిగినా.. స్వామివారికి శాఖాహారంతో కూడిన ప్రసాదాలను మాత్రమే నివేదిస్తారు. అంతేకాదు స్వామివారి సన్నిధిలో నిర్వహించే అన్నదానంలో కూడా శాఖాహార వంటకాలే ఉపయోగిస్తారు.. కానీ మీరు చదవబోయే కథనంలో మాత్రం ఓ పార్టీ నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. గణపతి మండపం వద్ద చేయకూడని పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసిపి నాయకులు దారుణానికి పాల్పడ్డారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, మొండితోక అరుణ్ కుమార్ వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని గణపతి మండపం వద్ద చికెన్ బిర్యాని పంపిణీ చేశారు.. చికెన్ బిర్యాని వడ్డించడం పట్ల నందిగామ లో వివాదం చెలరేగింది. ఈ ప్రాంతంలో ఆగస్టు 27న గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి వైసీపీ నేతలు మాత్రం చికెన్ బిర్యాని వడ్డించడాన్ని భక్తులు తప్పుపడుతున్నారు.
ఎటువంటి అనుమతి లేకుండానే వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో నిర్వహించారు. గణేష్ మండపం వద్ద మాంసంతో కూడిన వంటకాన్ని వడ్డించడం పట్ల పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో భక్తులు కొంతమంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి.. 20 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఆహార పాత్రలు.. నీటి సీసాలు, ఇతర వస్తువులను అక్కడ నుంచి తొలగించారు. తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇటువంటి పనులు చేపట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.