YSRCP Protest Chaos: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలయింది. రెండు సంవత్సరాల వేడుకను కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు గొప్పగా చేసుకున్నాయి. ప్రతిపక్ష హోదా కూడా లేని వైసిపి రాష్ట్రవ్యాప్తంగా బలవంతపు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ పార్టీ కార్యకర్తలు వైసీపీ జెండాలు పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలలో వైసిపి కార్యకర్తలు అతి చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో వైసిపి కార్యకర్తలు బల ప్రదర్శన చూపించారు. అసలే పెట్రోల్ రేట్లు మండిపోతుంటే బైక్ ల మీద ర్యాలీ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మెరుగ్గా జరుగుతుంటే.. ఎవరికి ఏమీ ఇవ్వలేదన్నట్టుగా ప్రచారం చేశారు. అదే కాదు భారీగా ఫ్లెక్సీలు ముద్రించి.. హంగామా చేశారు. వాస్తవానికి నిరసన కార్యక్రమం చేపట్టే చోట ఇలాంటి హడావిడి ఎందుకో వారికే తెలియాలి. పైగా వైసీపీ కార్యకర్తలు మూగ జంతువులను కూడా తమ నిరసన కార్యక్రమాలకు వాడుకున్నారు. వైసీపీ కార్యకర్తల అతి చూసిన మూగ జంతువులు రచ్చ చేశాయి. దీంతో వైసిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహానికి దిగారు. ఒక దున్నపోతును తీసుకొచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు. వైసీపీ కార్యకర్తల హడావిడి చూసిన దున్నపోతు రెచ్చిపోయింది. వెంటనే పరుగులు పెట్టింది. ఎమ్మెల్సీ అరుణ్.. మాజీ ఎమ్మెల్యే మొండితోక ఇంటి దగ్గర నుంచి దున్నపోతుతో ర్యాలీ చేపట్టారు. దున్నపోతు బెదిరిపోవడంతో పలువురు గాయపడ్డారు. దీంతో వైసిపి నిరసన కార్యక్రమం కాస్త అభాసుపాలైంది.
“ప్రజాస్వామ్యం మనకు అనేక హక్కులు ఇచ్చింది. నిరసనలు చేపట్టుకోవచ్చు. ధర్నాలు చేయవచ్చు. కానీ అందులోకి మూగ జంతువులను తీసుకురావాల్సిన అవసరమేముంది. గతంలో వైసిపి నాయకులు ఒక గాడిద మీద తమ ప్రతాపాన్ని చూపించారు. నిరసన కార్యక్రమానికి గాడిదని తీసుకొచ్చి దానిని విచక్షణ రహితంగా కొట్టారు. ఇప్పుడేమో దున్నపోతుని తీసుకొచ్చారు.. ఆ దున్నపోతు వీరి హడావిడి చూసి తట్టుకోలేక బెదిరిపోయింది. చాలామంది గాయాలయ్యాయి. నిరసన కార్యక్రమం కాస్త రక్తసిక్తమైంది. వారికి రక్తం లేకుండా ఏ పని చేయడం సాధ్యం కాదనుకుంటా అంటూ” టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ శ్రేణులు కళ్లు పెద్దగా చేసి చూస్తే ఏపీలో డెవలప్మెంట్ కనిపిస్తుందని సూచిస్తున్నారు.

