AP Best Teacher Awards 2025: ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వాలని భావిస్తోంది. అందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఈనెల 8 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులందరికీ అవార్డులు అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఏటా ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు నెల రోజులు ముందుగానే సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇదో సువర్ణ అవకాశం. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
దరఖాస్తులు ఇలా..
ఈనెల 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డివిజన్ స్థాయిలో పరిశీలన చేసి ఒక్కో కేటగిరికి ముగ్గురుని ఎంపిక చేస్తారు. అయితే తుది జాబితాను మాత్రం రాష్ట్రస్థాయి కమిటీ ఖరారు చేస్తుంది. ఎంపికైన వారికి 20 వేల రూపాయల నగదు, ప్రశంసా పత్రం, పతకం అందిస్తారు. ఒక్కో కేటగిరికి ముగ్గురు చొప్పున డివిజన్ స్థాయిలో ఈనెల 11న పరిశీలించి ఎంపిక చేస్తారు. అనంతరం జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారికి( Deo ) అందిస్తారు. ఈనెల 14న జిల్లాస్థాయి కమిటీలు ఒక్కో క్యాటగిరీకి ఒకరు చొప్పున తుది జాబితాను రూపొందిస్తారు. అటు తరువాత ఈ నెల 16న ఈ జాబితాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఇంటర్వ్యూలు చేస్తారు. 25న తుది జాబితాను ఖరారు చేస్తారు.
Also Read: దేశంలో ఏపీకి మూడో స్థానం
ముందుగానే సన్నాహాలు..
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారికి సెప్టెంబర్ ఐదున 20వేల నగదు తో పాటు ప్రశంసా పత్రం, పతకం అందిస్తారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ జిల్లా స్థాయిలో 30 మంది, మండల స్థాయిలో పదిమందికి మించకుండా అవార్డులకు ఎంపిక చేయాలని సూచించింది. ఉత్తమ విద్యా బోధనతో పాటు ఇతర అంశాలను సైతం పరిగణలోకి తీసుకుంది. ఈ అవార్డుకు దరఖాస్తు చేయకపోయినా ఉత్తమ టీచర్ తరఫున ఎవరైనా ఐదుగురు టీచర్లు సిఫారసు చేసేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయితే ఏటా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానం జరుగుతూ వస్తున్నా.. ఈ ఏడాది మాత్రం ముందుగానే సన్నాహాలు ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకునేందుకు ఉపాధ్యాయులు సిద్ధపడుతున్నారు.